వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లోరిడా కాల్పులు: బుల్లెట్‌ను అడ్డుకున్న ల్యాప్‌టాప్

అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్ర‌యంలో జ‌రిగిన కాల్పుల్లో ఓ వ్య‌క్తిని అతని ల్యాప్‌టాప్ కాపాడింది.

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్ర‌యంలో జ‌రిగిన కాల్పుల్లో ఓ వ్య‌క్తిని అతని ల్యాప్‌టాప్ కాపాడింది. ఆగంత‌కుడు కాల్పులు జరుపుతున్న స‌మ‌యంలో అంద‌రూ హ‌డావుడిగా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

ఎయిర్ పోర్టులో దుండగుడి కాల్పులు, 5గురి మృతి, అరెస్ట్

స్టీవ్ ఫ్రాపియ‌ర్ అనే వ్యక్తి కూడా అదే త‌ర‌హాలో విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప‌రుగులు తీశాడు. అయితే భుజానికి వేసుకున్న ల్యాప్‌టాప్ బ్యాగే ఆయ‌న‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంగా మారింది. ప‌రుగులు తీస్తున్న స్టీవ్ దిశ‌గా షూట‌ర్ కాల్పులు జ‌రిపాడు.

Fort Lauderdale airport shooting witness: My laptop took a bullet for me

అతనివైపు దూసుకొచ్చిన బుల్లెట్.. వీపుకు వేసుకున్న బ్యాగ్‌కు తగిలింది. అయినా ప్రాణ భ‌యంతో అలాగే ప‌రుగులు తీశాడు. వాషింగ్‌రూమ్‌కు వెళ్లిన త‌ర్వాత బ్యాగ్ చూశాడు. ల్యాప్‌టాప్‌కు బుల్లెట్ త‌గిలిన‌ట్లు గ్ర‌హించాడు.

ఆ బ్యాగ్‌ను అత‌ను వెంట‌నే పోలీసుల‌కు అప్ప‌గించాడు. ఒక‌వేళ బ్యాగ్‌లో ల్యాప్‌టాప్ లేకుంటే ఆ బుల్లెట్ త‌న వీపులో దిగేద‌ని స్టీవ్ చెప్పాడు. విమానాశ్ర‌యంలో సుమారు 45 సెకండ్ల పాటు కాల్పులు జ‌రిగినట్లు మ‌రో ప్ర‌త్య‌క్ష సాక్షి తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

English summary
A bullet lodged in Steve Frappier’s laptop. Frappier was in the line of fire from suspected shooter Esteban Santiago during the Fort Lauderdale airport shooting and was saved by the laptop sitting in his backpack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X