• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒసామా బిన్ లాడెన్ హార్డ్‌డిస్క్‌లో.. షాకింగ్ వీడియోలు! భారత్ పైనా కన్నుండేదా?

By Ramesh Babu
|

న్యూయార్క్: అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్ ఖాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా దళాలు హతమార్చాయి. ఈ సందర్భంగా అతడి ఇంటి నుంచి కొన్ని లక్షల పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి.

అలా స్వాధీనం చేసుకున్న వాటి నుంచి 4.70 లక్షల ఫైళ్లను అమెరికాకు చెందిన సీఐఏ విడుదల చేసింది. ఉగ్రవాదుల ప్రణాళికలు ఎలా ఉంటాయో ప్రజలు తెలుసుకునేందుకే వీటిని విడుదల చేసినట్టు సీఐఏ డైరెక్టర్ మైక్ పోంపెయో తెలిపారు.

ఇదే తొలిసారి కాదు, గతంలోనూ...

ఇదే తొలిసారి కాదు, గతంలోనూ...

లాడెన్ ఫైళ్లను బయటపెట్టడం ఇదే తొలిసారి కాదు. మే 20, 2015లో ఒకసారి, మార్చి 1, 2016 మరోసారి, ఈ ఏడాది జనవరి 19న ఇంకోసారి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఓడీఎన్ఐ) బయటపెట్టింది. తాజాగా బయటపెట్టిన వాటిలో లాడెన్‌కు చెందిన లేఖలు, వీడియో, ఆడియో టేపులు, ఇతర వస్తువుల ఉన్నాయి. జాతీయ భద్రత కోసం మరింత సమాచారాన్ని ప్రజలతో పంచుకుంటామని ఈ సందర్భంగా సీఐఏ డైరెక్టర్ మైక్ పోంపెయో తెలిపారు.

టామ్ అండ్ జెర్రీ కార్టూన్లు...

టామ్ అండ్ జెర్రీ కార్టూన్లు...

తాజాగా బయటపెట్టిన వాటిలో లాడెన్ పర్సనల్ డైరీ, 18 వేల డాక్యుమెంట్ ఫైళ్లు, 79 వేల ఆడియో క్లిప్పులు, ఫొటోలు ఉన్నాయి. పదివేల వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఇక వీడియోల్లో పలు చిన్న పిల్లల సినిమాలు, అశ్లీల వీడియోలు ఉండడం విశేషం. టామ్ అండ్ జెర్రీ కార్టూన్లతోపాటు అప్పట్లో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన ‘చార్లీ బిట్ మై ఫింగర్' వంటి డౌన్ లోడ్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే ‘ఆంట్జ్', ‘బ్యాట్‌మ్యాన్', ‘కార్స్', ‘చికెన్ లిటిల్', ‘రెసిడెంట్ ఈవిల్' వంటి సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే తనపై వచ్చిన డాక్యుమెంటరీలు, బీబీసీ, నేషనల్ జియోగ్రఫీలో వచ్చే అరుదైన డాక్యుమెంటరీలు కూడా ఉండడం విశేషం.

ద స్టోరీ ఆఫ్ ఇండియా...

ద స్టోరీ ఆఫ్ ఇండియా...

అనేక హాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని దేశాలకు చెందిన చారిత్రాత్మక వీడియోలు కూడా ఆల్ ఖయిదా నేత ఒసామా బిన్ లాడెన్ ఇంట్లో ఉన్నట్లు సీఐఏ వెల్లడించింది. లాడెన్ ఇంట్లో లభ్యమైన అనేక వీడియో సీడీల కలెక్షన్‌లో.. 'ద స్టోరీ ఆఫ్ ఇండియా' కూడా ఉంది. మన దేశంపై బీబీసీ ఛానల్ రూపొందించిన 'ద స్టోరీ ఆఫ్ ఇండియా' కూడా లాడెన్ లైబ్రరీలో ఉంది. చరిత్రకారుడు మైఖేల్ వుడ్ 'ద స్టోరీ ఆఫ్ ఇండియా' డాక్యుమెంటరీ తీశాడు. దీన్ని మొత్తం ఆరు ఎపిసోడ్‌లుగా 2007 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ప్రసారం చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాలు స్వాతంత్య్రం పొంది 60 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ సిరీస్‌ను ప్రసారం చేశారు. భారత దేశంలోని చరిత్రాత్మక ప్రదేశాలను విజిట్ చేస్తూ ఆ ప్రాంతాలను ఈ డాక్యుమెంటరీలో రచయిత వర్ణిస్తాడు.

తనపై రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా...

తనపై రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా...

ఒక్క మన దేశ సమాచారమే కాకుండా, లాడెన్ ఇంట్లో దొరికిన వాటిల్లో కొన్ని మిగతా దేశాలకు చెందిన నాగరికత వీడియోలు కూడా ఉన్నాయి. వివిధ సంస్కృతులు, జాతులపై ఎన్జీసీ రూపొందించిన ప్రోగ్రామ్‌లు కూడా ఆ లిస్టులో ఉన్నాయి. చిన్న పిల్లలు అమితంగా ఇష్టపడే ఆంట్జ్, కార్స్ లాంటి హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలు కూడా లాడెన్ ఇంట్లో దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తనపై అంతర్జాతీయ ఛానళ్లు రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 2011, మే2వ తేదీన పాక్‌లో ఒసామాను అమెరికా హతమార్చింది. ఉగ్రవాద సంస్థలు తమ దాడులకు ఎలా ప్రణాళికలు వేస్తాయన్న అంశాన్ని తెలియపరిచేందుకు ఒసామా పత్రాలను రిలీజ్ చేస్తున్నట్లు సీఐఏ వెల్లడించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is the fourth tranche of materials taken from the walled compound where bin Laden and his family lived to be made public by the U.S. government since May 2015. The documents include Laden's personal journal, over 18,000 document files and 79,000 audio and image files, which include practice reels for public speeches, audio correspondence and imagery gathered or generated by al-Qaeda for a variety of purposes. However, the CIA withheld release of nearly two dozen videos, including the one titled The Story of India stating that they were copyrighted videos. The 'Story of India' is a BBC documentary series, written and presented by historian Michael Wood about history of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more