• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్‌లో నేలమట్టమైన నాలుగు వందల ఏళ్లనాటి గురునానక్ ప్యాలెస్‌

|

పాకిస్తాన్‌లో కొందరు స్థానికులు ఎంతో చరిత్ర కలిగి ఉన్న గురునానక్ ప్యాలెస్‌ను ధ్వంసం చేశారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ గురునానక్ ప్యాలెస్‌లోని సామగ్రిని ధ్వంసం చేసి అమ్మేశారు. ఈ గురునానక్ ప్యాలెస్‌ను నాలుగు వందల ఏళ్ల క్రితం బథన్‌వాలా గ్రామంలో నిర్మించారు. ఇది న్యూలాహోర్ రోడ్డుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ముస్లి పేరు పెట్టుకుంటే చంపేస్తారా.. బీహార్‌లో ఇదే జరిగింది..!

Four Hundred years historical Gurunanak Palace demolished in Pakistan

గురునానక్ ప్యాలెస్‌ను ఇటుకలు, మట్టి, బంకమట్టి, సున్నపురాయితో నిర్మించారు. ఈ భవంతిలో 16 పెద్ద గదులు ఉన్నాయి. అందమైన డిజైన్లతో పెద్ద తలుపులు కూడా ఉన్నాయి. ఈ భవంతిలో ఫర్నీచర్ కూడా ఆ రోజుల్లో చాలా గ్రాండ్‌గా తయారు చేశారు. అన్ని గదులకు చక్కటి వెంటిలేషన్ ఉంది. చిన్న ద్వీపాలు ఈ గదులకు అదనపు ఆకర్షణ ఇస్తాయి.ఇక ఫర్నీచర్ కోసం వినియోగించిన చెక్క చాలా విలువైనది. ఒక్క అడుగు దాదాపు రూ. వెయ్యి ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇక దీన్ని గురునానక్ ప్యాలెస్‌గా పిలిచేవారని స్థానిక వ్యక్తి మొహ్మద్ అస్లాం చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ప్యాలెస్‌ను సందర్శించుకునేవారని చెప్పారు.

Four Hundred years historical Gurunanak Palace demolished in Pakistan

కెనడా నుంచి వచ్చిన ఓ బృందం ఈ ప్యాలెస్ గురించి ఎంతో గొప్పగా బయట ప్రపంచానికి తెలియజేసిందని గుర్తు చేసుకున్నాడు అస్లాం. ఇప్పటికే ప్యాలెస్ ధ్వంసం అయిన సంగతి అక్వాఫ్ శాఖకు తెలిపామని అయితే ఇప్పటి వరకు దీనిపై ఎవరూ స్పందించలేదని స్థానికులు తెలిపారు. ఇది ఎవరో పెద్ద మనుషులే దీన్ని ధ్వంసం చేశారన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పాత రికార్డులు, దీని వారసులు ఎవరో అనేదానిపై పలు సంస్థలు పరిశోధనలు చేసినప్పటికీ కొంచెం కూడా క్లూ దొరకడం లేదు. అయితే మొహ్మద్ అన్వర్ అనే వ్యక్తి ఆ భవంతి తనదే అని చెప్పుకొచ్చారు. దేశ విభజన తర్వాత ఆ భవంతిలో తన తాత ముత్తాతలు నివసించారని చెప్పారు. అయితే తాము మాత్రం వేరే దగ్గర నివాసం ఉంటున్నట్లు చెప్పాడు. తమ తాత ముత్తాతల తర్వాత ఇక్కడ ఎవరు నివాసముండే వారో తెలియదని చెప్పిన మొహ్మద్ అన్వర్...అందుకే కూల్చి వేసినట్లు చెప్పాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A group of locals partially demolished a four-storey centuries-old building allegedly with the permission of Auqaf department officials. Doors, windows and ventilators, deemed priceless, have also been sold.The historical Guru Nanak Palace seems to have been constructed over four centuries ago in Bathanwala village, 20 kilometres from here, on New Lahore Road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more