వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు కోసం అడ్డదారులు.. హెచ్1బీ వీసా స్కాంలో ముగ్గురు తెలుగువారి అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : వ్యాపారం అన్నాక పోటీ తప్పుదు. అయితే ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు అడ్డదారులు తొక్కితే అడ్డంగా బుక్కవడం ఖాయం. అమెరికాలో ఐటీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ నడుపుతున్న నలుగురు ఇండో అమెరికన్ల విషయంలో ఇదే జరిగింది. హెచ్ 1బీ వీసాల విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు ముగ్గురు తెలుగువారు కటకటాలపాలయ్యారు.

హెచ్1బీ వీసాల్లో అక్రమాలు

హెచ్1బీ వీసాల్లో అక్రమాలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన విజయ్ మానే, వెంకట రమణ మన్నెం, సతీశ్ వేమూరి అమెరికాలో ఉంటున్నారు. ఫెర్నాండో సిల్వా అనే వ్యక్తితో కలిసి ఐటీ కంపెనీలకు ఉద్యోగులను వెతికిపెట్టే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నడుపుతున్నారు. అయితే పోటీ పెరిగిపోవడంతో సంపాదన పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కారు. హెచ్1బీ వీసా ప్రోగ్రాంను టార్గెట్‌గా ఎంచుకున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలని కలలగనే లక్షల మంది ఏటా హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇదే అదునుగా నలుగురు నిందితులు వీసా ఫ్రాడ్‌కు తెరతీశారు.

తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి

తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి

విజయ్, వెంకట రమణ, సతీశ్‌లు న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్ కౌంటీలో ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్ ఇన్‌కార్పొరేషన్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ ఇన్‌కార్పొరేషన్ పేరుతో రెండు ఐటీ స్టాఫింగ్ కంపెనీలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఫెర్నాండో సిల్వా, వెంకట రమణలు న్యూజెర్సీలో మరో కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రొక్యూర్, క్రిప్టో సంస్థల ద్వారా విదేశీ ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుని వారిని హెచ్1బీ వీసాల కోసం స్పాన్సర్ చేసేవారు. ఆయా అభ్యర్థులు అప్పటికే న్యూజెర్సీలోని కంపెనీలో పనిచేస్తున్నట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి హెచ్1బీ కోసం దరఖాస్తు చేసేవారు. అలా అప్లై చేసినవారికి వీసా అందిన వెంటనే వారిని వేరే కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు చూపించే వారు. ఇందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేసేవారు. దీంతో ప్రత్యర్థి కంపెనీల కన్నా వీరిని ఆశ్రయించే వారి సంఖ్య పెరిగి వారి బిజినెస్ దెబ్బతినేది.

అడ్డంగా బుక్కైన నిందితులు

అడ్డంగా బుక్కైన నిందితులు

నలుగురి భాగోతంపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. విజయ్, వెంకట రమణ, ఫెర్నాండో, సతీశ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరపరిచారు. 2,50,000డాలర్ల పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. వీరు చేసిన నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2,50,000డాలర్ల జరిమానా విధించే అవకాశముంది.

English summary
Four Indo-American executives from two IT recruiting companies have been arrested on the charges of fraudulently using the H-1B visa programme to gain an unfair advantage over their competitors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X