వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయపడతారు.. కానీ అద్భుతం: ముందు వెనుక కార్లు, బిజీ రోడ్డుపై 4 సింహాలు అలా నడుస్తుంటే (వీడియో)

|
Google Oneindia TeluguNews

సౌతాఫ్రికా: పులులు, సింహాలను చూస్తే ఎవరైనా భయపడతారు. జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లలో ఉంచినప్పుడు మాత్రమే చూస్తాం. అక్కడ కూడా అది కాస్త మనవైపు వస్తుందంటే భయపడుతాం. అలాంటిది, సౌతాఫ్రికాలో నాలుగు సింహాలు నడి రోడ్డుపై నడుస్తున్నాయి. వాటి వెనుక, ముందు కార్లు ఉన్నాయి.

 వైరల్‌గా మారిన వీడియో

వైరల్‌గా మారిన వీడియో

ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన సౌతాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్ వద్ద చోటు చేసుకుంది. ఆ నాలుగు సింహాలు నడిచిన ఆ రోడ్డు ఎంతో బిజీగా ఉంటుంది. అయితే, పెద్దగా ట్రాఫిక్ లేకపోయినప్పటికీ సింహాలు నడుస్తుండటంతో వాటిని క్లిక్ మనిపించడానికి, అలాగే వేగంగా వెళ్లి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఎవరూ వేగంగా వెళ్లలేదు.

మెల్లిగా వెళ్లిన కార్లు

సింహాలు నడుస్తున్నప్పుడు ఆ బిజీ రోడ్డు పైన అటు, ఇటు కార్లు వెళ్తున్నాయి. ఆ సమయంలో కార్లు మెల్లిగా వెళ్లడంతో కొంత ట్రాఫిక్ జామ్ అయింది. కొందరు కారులో నుంచి వీడియో తీశారు. కార్లలో నుంచి వీడియో తీసిన వారి వాటిని తమ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు. వీటిని చాలామంది చూస్తున్నారు. ఎంతోమంది షేర్ చేస్తున్నారు. ఈ వీడియో అర నిమిషానికి పైగా ఉంది.

 అద్భుతమే, కానీ భయానకం

అద్భుతమే, కానీ భయానకం

ఈ వీడియోపై ఎంతోమంది స్పందిస్తున్నారు. వివిధ రకాల కామెంట్స్ పెట్టారు. 'వావ్! బ్యూటీఫుల్ ఎనిమిల్స్', 'మనల్ని మింగేసేవరకు అందంగా ఉంటుంది', 'ఈ సింహాలతో కలిసి ఎవరైనా రోడ్డుపై నడవగలరా, నేను సవాల్ చేస్తున్నా', 'ఆ ట్రాఫిక్‌లో నేను చిక్కుకుంటే బాగుండుననిపిస్తోంది, 'అద్భుతం.. కానీ భయానకం' నేను ఆ అందమైన సింహాలను చూసేదానిని'.. అంటూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

English summary
A video going viral on social media shows four full-grown lions walking on a road, even as cars follow them slowly. The scary video, first shared on Facebook by a page called 'Lions Of Kruger Park And Sabi Sand', has since gone viral with over 2 million views and a ton of shocked comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X