వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో కత్తి‌పోట్లు, నలుగురు మృతి, ఎదురుకాల్పుల్లో నిందితుడి హతం

|
Google Oneindia TeluguNews

ప్యారిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఓ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఏమైందో తెలియదు కానీ కత్తితో విచక్షణరహితంగా దాడిచేశాడు. దాడిలో నలుగురు పోలీసులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కత్తితో దాడిచేసిన వ్యక్తిని పోలీసులు షూట్ చేశారు. ప్యారిస్ పోలీసు ప్రధాన కార్యాలయంలో తుపాకుల మోత కలకలం రేపింది.

పోలీసు అధికారులపై దాడి చేసిన వ్యక్తి కూడా హెడ్ క్వార్టర్స్‌లోని పనిచేస్తున్నట్టు గుర్తించారు. అతనిని పై అధికారులు ఇబ్బందికి గురిచయేడంతో దాడి చేశారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. తన పై అధికారులపై ఓ వ్యక్తి దాడి చేయడం, దాదాపు నలుగురు చనిపోవడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతను మరింత మందిపై దాడిచేస్తారెమోనని కాల్చి చంపారు. ఆ తర్వాత పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు జరిపారు. ఘటనాస్థలానికి పదుల సంఖ్యలో అత్యవసర వాహనాలు తరలివచ్చాయి.

Four people killed in Paris police HQ knife attack

పోలీసు హెడ్ క్వార్టర్ సమీపంలో ఉన్న విస్నిటీ అనే మెట్రో స్టేషన్ గుండా మెట్రో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. పోలీసు అధికారులపై కాల్పులు జరిపిన వ్యక్తి ఏ విభాగంలో పనిచేస్తున్నారనే అంశంపై క్లారిటీ రాలేదు. కత్తిపోట్ల తర్వాత పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో అత్యవసర సమాచారాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా అందజేశారు. ప్యారిస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కత్తి పోట్లతో ఆ దేశ విదేశాంగ మంత్రి క్రిస్టోప్ తన టర్కీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. నిందితుడు దాడి ఎందుకు చేశాడనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

English summary
A man employed at police headquarters in central paris stabbed four officers to death before being shot dead by police, sources told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X