వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..

|
Google Oneindia TeluguNews

గడిచిన దశాబ్దకాలంలో.. ఉదారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయవాద ధోరణి దూసుకొచ్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సందర్భం చాలా దేశాల్లో చోటుచేసుకుంది. అతిపెద్ద, సుదీర్ఘ కాలంగా ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతోన్న అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే జాతీయవాద నినాదంతో నాలుగేళ్ల కిందట డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి అధిపతి కావడం వెనుక ఫాక్స్ న్యూస్ కృషి ఎవరూ కాదనలేనిది. తొలి నుంచీ సంప్రదాయవాదులను మాత్రమే సమర్థించిన ఫాక్స్ న్యూస్.. ట్రంప్ జాతీయవాదానికి మరింత ఆజ్యం పోసి ఆయనను ప్రెసిడెంట్ గా నిలబెట్టగలిగింది. అంతేకాదు, గడిచిన నాలుగేళ్లలో ఫాక్స్ న్యూస్ 'ట్రంప్ మౌత్ పీస్'గానూ పనిచేసిందనే విమర్శలు ఎదుర్కొంది. అయితే..

నిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామనిమ్మగడ్డ రహస్యభేటీ లీకైందిలా -హరీశ్ సాల్వే ఉచిత వాదన -కొత్త దేవుడిలా జగన్: ఎంపీ రఘురామ

 ట్రంప్ జ్యోతిపై నీళ్లు..

ట్రంప్ జ్యోతిపై నీళ్లు..

ప్రెసిడెంట్ ట్రంప్-ఫాక్స్ న్యూస్ మధ్య సంక్లిష్టమైన అనుబంధం తాజా ఎలక్షన్ డే సందర్భంగా తేలిపోయిన వైనం చర్చనీయాంశమైంది. ఒక రకంగా ట్రంప్ రాజకీయ జీవితాన్ని ప్రారంభింపజేసిన ఫాక్స్ న్యూస్.. ఇప్పుడు ఆయన పతనాన్ని రిపోర్టు చేస్తూ సంభావ్య ముగింపును సూచించే స్థితికి చేరింది. మిగతా పెద్ద ఛానెళ్లు సాహసించని విధంగా ‘అమెరికా 46 అధ్యక్షుడిగా జోబైడెన్ గెలవబోతున్నారు'అంటూ ముందస్తుగా ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆరిజోనా రాష్ట్ర ఫలితాలపైనా ఈ మీడియా సంస్థ విశ్లేషణ హైలైట్ గా నిలిచింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మంగళ, బుధవారాల్లో ఫాక్స్ న్యూస్.. ఒకప్పుడు తానే ఆజ్యంపోసి వెలిగించిన ట్రంప్ జ్యోతిపై నీళ్లు కుమ్మరించే ప్రక్రియను ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. పాత వాసనలు వదులుకోలేక, అనూహ్య ఫలితాన్ని అనివార్యంగా రిపోర్ట్ చేయాల్సిన సందర్భంలో ఫాక్స్ న్యూస్ వ్యవహారశైలి ఇలా సాగింది..

 బైడెన్ వైపు మలుపు..

బైడెన్ వైపు మలుపు..

ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే తాను గెలిచేశానని, కౌంటింగ ఇంకా కొనసాగించడం మోసమని, వెంటనే కౌంటింగ్ నిలిపేయకుంటే కోర్టుకు వెళతానంటూ వైట్ హౌజ్ వేదికగా బుధవారం తెల్లవారుజామున ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ ప్రకటన చేసిన సందర్భంలో ఆ కార్యక్రమానికి ఫాక్స్ న్యూస్ లోని ఇద్దరు స్టార్ జర్నలిస్టులు లారా ఇంగ్రాహామ్, జెనిన్ పిర్రోలు కూడా హాజరయ్యారు. ఎన్నికలు-ఫలితాలు వెలువడిన రాత్రి(మంగళవారం రాత్రి) కూడా ఫాక్స్ న్యూస్ స్క్రీన్ నిండా ట్రంప్ అనుకూల ప్రకటనలు, ఆయనను సమర్థించే హోస్టులతో చర్చా కార్యక్రమాలు జరిగాయి. అయితే, బుధవారం మధ్యాహ్నానికి.. అప్పటికింకా ట్రంప్ న్యాయపోరాటానికి సిద్ధమవుతుండగానే.. ఫాక్స్ స్క్రీన్ రివర్స్ లో చూస్తున్నామా? అని రిపబ్లికన్లే విస్తుపోయేలా ‘బైడెన్ విజయం దాదాపు ఖరారైంది'అంటూ ప్రోగ్రామింగ్ ఆపరెండీని మార్చేసుకుంది..

రిపబ్లికన్ నేతల లైవ్ ప్రసారాలు కట్..

రిపబ్లికన్ నేతల లైవ్ ప్రసారాలు కట్..

ఎన్నికల ప్రక్రియలో మోసం జరుగుతోందంటూ ట్రంప్ న్యాయవాది రూడీ గియులియాని బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ ను లైవ్ ప్రసారం చేసిన ఏకైక కేబున్ నెట్ వర్క్ ఫాక్స్ న్యూసే. కానీ రూడీ మాట్లాడుతుండగానే.. ఆయనను పక్కకు నెట్టేసి.. ‘బిగ్ బ్రేకింగ్ న్యూస్' అంటూ ‘మిచిగన్ లో జోబైడెన్ లీడ్ లో ఉన్నారు.. ఆ రాష్ట్రంలో డెమోక్రట్ల విజయం దాదాపు ఖరారైనట్లే' అనే వార్తను ప్రసారం చేశారు. ఎన్నికల ప్రక్రియలో మోసంపై ట్రంప్ న్యాయపోరాటం ఫలితాలను మార్చొచ్చని ఫాక్స్ పొలిటికల్ డిబేట్ హోస్ట్ బ్రెట్ బేయర్ వ్యాఖ్యానించగా, ఆ వెంటనే ఫాక్స్ న్యూస్ పొలిటికల్ ఎడిటర్ క్రిస్ స్టిర్వాల్ట్ తెరపైకొచ్చి.. ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవని, బైడెన్ మెజార్టీ(270) ఓట్లు సాధిస్తారని కుండబద్దలు కొట్టారు. ‘న్యాయ వ్యాజ్యం.. కుంభకోణ వ్యాజ్యం..అసలు వీటికి ఆధారాలున్నాయా?'అనే పదాలను కూడా క్రిస్ వాడటం గమనార్హం.

ఫాక్స్ జిత్తుల్ని ట్రంప్ పసిగట్టారా?

ఫాక్స్ జిత్తుల్ని ట్రంప్ పసిగట్టారా?

అమెరికాలో కేబుల్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమయ్యే ఛానెళ్లలో ఫాక్స్ న్యూస్ నంబర్ వన్ గా ఉంటూనే అది చాలా కాలంగా ట్రంప్ కేంద్రంగా తనదైన కక్ష్యలో తిరుగుతూ వచ్చింది. అయితే 2020 ఎన్నికల ప్రహాసనం తర్వాత ఫాక్స్ వైఖరిలో మార్పులను అందరికంటే ముందు ట్రంపే పసిగట్టారు. ఎలక్షన్ డే(మంగళవారం) ఉదయం ట్రంప్.. అదే ఛానెల్ లో ప్రసారమయ్యే ‘‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్'' కార్యక్రమంలో మాట్లాడారు. 2015లో ట్రంప్ ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న నాటి నుంచి ఆయన మద్దతుదారులకు ఒకరకంగా రక్షణ వలయంగా నిలచిన ఫాక్స్ న్యూస్.. ‘గడిచిన నాలుగేళ్లలో మీరు చూసిన మార్పులేంటి?' అని ప్రశ్నించగా, ట్రంప్ తడుముకోకుండా..‘ఫాక్స్ చాలా మారిపోయింది'అని గంభీరంగా సమాధానమిచ్చారు.

 రేటింగ్ కోసమా? స్ట్రాటజీ మార్పా?

రేటింగ్ కోసమా? స్ట్రాటజీ మార్పా?

ఫాక్స్ న్యూస్ తో తన అనుబంధాన్ని ఏనాడూ దాచుకోని ట్రంప్.. మీడియాపై విరుచుకుపడే క్రమంలో తన జేబు సంస్థను కూడా వదిలేవాడుకాదు. ఎన్నికల ప్రచారంలో సరైన కవరేజ్ లభించకపోతే వెంటనే ఛానెల్ సీఈవో సుజానె స్కాట్ కు ఫోన్లు చేయడం, ప్రచారంలో తరచూ ఫాక్స్ న్యూస్ హోస్టుల పేర్లను ప్రస్తావిండం సహజంగా జరిగేది. ఫాక్స్ న్యూస్ కు చెందిన పలువురు జర్నలిస్టుల్ని ట్రంప్ తన ప్రచార సిబ్బందిగానూ నియమించుకున్నారు. ఫాక్స్ న్యూస్ ప్రచార బలంతో కీర్తి గణించిన ఫ్లోరిడా రిపబ్లికన్ పార్టీ ర్యాన్ డిసాంటిస్ సైతం ఛానెల్ లో బైడెన్ అనుకూల వార్తలు రావడాన్ని గర్హిస్తూ.. బహుశా రేటింగ్ కోసమో, మరో స్ట్రాటజీతోనే ఇలా జరుగుతుండొచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల వార్తలను ప్రసారం చేసిన సమయంలో ఫాక్స్ న్యూస్ తన సహజమైన(ట్రంప్ అనుకూల) పద్ధతికి విరుద్ధంగా న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) డేటాను వాడుకుంటూ విశ్లేషణలు కొనసాగించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ట్రంప్ వాదనను వీలైనంతగా తప్పు పడుతూ, అదే సమయంలో బైడెనే తదుపరి ప్రెసిడెంట్ అంటూ ప్రొజెక్షన్ ఇచ్చేసింది. ఒకరిద్దరు ట్రంప్ వీరవిధేయులు మాత్రమే ఆన్ స్క్రీన్ లో రిపబ్లికన్ అనుకూల కామెంట్లు చేశారు.

 ఇకపైనా ఫాక్స్ న్యూస్ నంబర్ 1..

ఇకపైనా ఫాక్స్ న్యూస్ నంబర్ 1..

పలు సర్వేల ప్రకారం.. అమెరికా కేబుల్ న్యూస్ చరిత్రలో ఎన్నికల ప్రైమ్ టైమ్ వార్తలకు సంబంధించి అత్యధిక వ్యూయర్ షిప్ ను సాధించింది ఫాక్స్ న్యూస్. ఎలక్షన్ ప్రైమ్ టైమ్ గా రాత్రి 8 నుంచి 11 వరకు ప్రసారమైన ఫాక్స్ న్యూస్ కార్యక్రమాలను 14.1 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు. సమీప ప్రత్యర్థి సీఎన్ఎన్ కు 9 మిలియన్ వ్యూస్ దక్కాయి. రెగ్యులర్ గా ప్రసారమయ్యే ఇతర కార్యక్రమాల్లో ఫాక్స్ న్యూస్ దే పైచేయి. ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ రూపెర్ట్ ముర్డోక్ పెద్ద కొడుకు, ఫాక్స్ న్యూస్ సంస్థకు యజమాని అయిన లాచ్లాన్ ముర్డోక్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బైడెన్ విజయ వార్తల ప్రసారంపై స్పందించారు. ‘‘నిర్వహణలో భిన్నత, వేర్వేరు రాజకీయ ధోరణులకు పీట వేయడం'' ద్వారానే ఫాక్స్ న్యూస్ ప్రత్యర్థులపై పైచేయి సాధించిందని, ఇకపైనా నంబర్ 1గా ఉండాలని ఆశిస్తున్నామని ముర్దోక్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల్లో ఫాక్స్ న్యూస్ ధోరణిపై డొనాల్ట్ ట్రంప్ స్పందించాల్సి ఉంది.

ట్రంప్‌దే విజయం: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్ -కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలుట్రంప్‌దే విజయం: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్ -కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

English summary
President Donald Trump and Fox News have a complicated relationship. Election Day did not help. The cable news channel that kick-started Trump’s political career was suddenly in the position of signaling its potential end. The network’s early call of Arizona on Tuesday night for Joe Biden infuriated Trump and his aides, who reached out publicly and behind the scenes to Fox News executives about the call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X