• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పదేళ్లకు సరిపడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేటర్లు..భారత్‌కు: ఓ2, వెంటిలేటర్లు: ఫ్రాన్స్ తక్షణ సహాయం

|

పారిస్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. భారత్‌ను తీవ్రంగా దెబ్బకొడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. లక్షల్లో నమోదవుతున్నాయి. దానికి అనుగుణంగా మరణాలు రికార్డవుతున్నాయి. కొద్దిరోజులుగా రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయంటే వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా- యాక్టివ్ కేసుల సంఖ్య 29 లక్షలకు చేరువ అయింది. ఒకేసారి ఇన్ని లక్షల మందికి వైద్యాన్ని అందించడానికి అవసరమైనన్ని మౌలిక సదుపాయాలు భారత్‌లో లేవనేది స్పష్టమౌతోంది.

ఆక్సిజన్ కొరత దేశాన్ని వేధిస్తోంది. పడకల షార్టేజీ వెంటాడుతోంది. ఆసుపత్రుల ఆవరణల్లో పేషెంట్లకు చికిత్స అందించే పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో నెలకొంది. ప్రాణవాయువు అందక పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు ఊపిరి వదులుతున్నారు. ఈ పరిస్థితులు ప్రపంచ దేశాలను కదిలిస్తున్నాయి. భారత్‌కు సహాయం చేయడానికి కదులుతున్నాయి. ఇప్పటికే అమెరికా ఈ దిశగా ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్‌లో సంభాషించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాజాగా- ఫ్రాన్స్ కూడా ఈ జాబితాలో చేరింది.

France announced that it will provide ventilators, liquid O2 and oxygen generators to India

భారత్‌కు అత్యవసరంగా ఆక్సిజన్ జనరేటర్లు, ఐసీయూ వెంటిలేటర్లు, లక్విడ్ ఓ2ను పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మరో అయిదురోజుల్లో ఇవి భారత్‌కు అందనున్నాయి. 2000 మంది పేషెంట్లకు సరిపడే లిక్విడ్ ఆక్సిజన్, 28 వెంటిలేటర్లు, ఐసీయూల్లో వినియోగించే పరికరాలు, ఆక్సిజన్ జనరేటర్లను భారత్‌కు అందిస్తామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి ఇమ్మానుయెల్ లెనైన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

  Karnataka Lockdown : EC Responsible For Second Covid Wave - Madras High Court | Oneindia Telugu

  భారత్‌, యూరోపినయన్ యూనియన్ దేశాలను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలను సాగించే తమ దేశ కంపెనీలను సైతం తమ దేశాధ్యక్షుడు ఇమ్మానుయెల్ మక్రాన్ ఆదేశాలను జారీ చేశారని చెప్పారు. ఫ్రెంచ్ ఎస్ఎంఈ తయారు చేసిన ఎనిమిది మెడికల్ ఆక్సిజన్ జనరేటర్లను భారత్‌కు పంపించబోతున్నామని, సుమారు పదేళ్ల వరకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ను అవి ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఏడాది పొడవునా ఇవి పని చేస్తాయని వివరించారు. ఒక్కో మెడికల్ ఆక్సిజన్ జనరేటర్‌కు- 250 పడకలకు నిరాటంకంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అలాగే- 10 వేల మంది పేషెంట్లకు ఆక్సిజన్‌ను అందించడానికి ఉద్దేశించిన సిలిండర్లను శరవేగంగా నింపగలమని చెప్పారు.

  English summary
  France has announced that it will provide India with eight high capacity oxygen generators, liquid oxygen for 2000 patients for five days, as well as 28 ventilators and equipment for ICUs.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X