వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించండి...ఐరోపా సమాఖ్యను ఆశ్రయించిన ఫ్రాన్స్

|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్ : పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్, జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేయాలంటూ ఐరోపా సమాఖ్యను ఆశ్రయించింది ఫ్రాన్స్. యురోపియన్ యూనియన్‌లో ఉన్న 28 సభ్య దేశాలు ఏకాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోనుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టు ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టు

మసూద్ అజార్ పై ఫ్రాన్స్ ముందడుగు

మసూద్ అజార్ పై ఫ్రాన్స్ ముందడుగు

మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఆయనపై ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్‌ను ఆశ్రయించినట్లు భారద విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. ఫ్రాన్స్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అని ఆయన చెప్పారు. అయితే ఏకాభిప్రాయం మేరకే ఐరోపా సమాఖ్య నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

మసూద్ అజార్‌పై ఆంక్షల విధింపుపై జర్మనీ చర్చలు

మసూద్ అజార్‌పై ఆంక్షల విధింపుపై జర్మనీ చర్చలు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మసూద్‌పై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ఈ కొత్త ప్రపోజల్‌ను యూరోపియన్ యూనియన్‌ ముందు ఉంచడం విశేషం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అల్ ఖైదా 1267 ఆంక్షల కమిటీ ముందు మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, దేశాలు ఉంచాయి. పుల్వామా దాడుల్లో భారత్‌కు చెందిన 40 జవాన్లు అమరులైన నేపథ్యంలో ఈ దేశాలు చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాయి. అయితే ఎప్పటిలాగే చైనా ఇందుకు అడ్డుపుల్ల వేసింది. మొత్తం 15 సభ్య దేశాలుండగా... 14 సభ్య దేశాలు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఒక్క డ్రాగన్ కంట్రీ మాత్రమే అడ్డుపడింది. తాజాగా జర్మనీ కూడా ఐరోపా సమాఖ్యలో సభ్యులుగా ఉన్న దేశాలతో మసూద్ అజార్ విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జర్మనీ కూడా అజార్‌పై ఆంక్షలు విధించాలని కోరుతున్నట్లు సమాచారం.

 మసూద్ అజార్‌పై ఆర్థిక ఆంక్షలు విధించిన ఫ్రాన్స్

మసూద్ అజార్‌పై ఆర్థిక ఆంక్షలు విధించిన ఫ్రాన్స్

ఒక్కసారి యూరోపియన్ యూనియన్ ప్రక్రియ ముగిశాక ఒక ప్రకటన వస్తుందని వెల్లడించాడు. ఒకవేళ యూరోపియన్ యూనియన్ మసూద్ అజార్‌పై ఆంక్షలు విధిస్తే ఇందులో సభ్యదేశాలుగా ఉన్న 28 దేశాల్లో మసూద్ ప్రయాణించకుండా నిషేధం విధించడం జరుగుతుంది. అంతేకాదు ఈ 28 దేశాల్లో మసూద్ అజార్‌కు సంబంధించిన ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని జప్తు చేసుకుంటాయి. ఇక మార్చి 15న ఫ్రాన్ మసూద్ అజార్‌పై తమ దేశంలో ఆర్థిక ఆంక్షలు విధించింది. అంతేకాదు యూరోపియన్ యూనియన్‌లోని ఇతర సభ్యులు కూడా తమ ప్రతిపాదనకు మద్దతు తెలిపేలా ప్రయత్నాలు ప్రారంభిస్తామని ఫ్రాన్స్ వెల్లడించింది.

English summary
France has approached the European Union to designate Jaish-e-Mohammed chief Masood Azhar as a global terrorist and the 28-member grouping is expected to take a decision on the issue based on the principle of consensus, the external affairs ministry said Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X