• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వైరస్ థర్డ్ వేవ్: రోజూ పాతిక వేలకు పైగా కొత్త కేసులు: ఆ దేశం అతలాకుతలం

|

ప్యారిస్: ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన విజృంభణ మొదలు పెట్టింది. భారత్ సహా అనేక దేశాల్లో క్రమగా రోజువారీ కేసుల్లో అనూహ్యం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌ ప్రభావానికి గురై విలవిల్లాడిన అనేక దేశాలు.. ఇప్పుడు థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 26 లక్షలను దాటాయి. పాజిటివ్ కేసులు, మరణాలు గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి.

  Covid-19 Third Wave : కరోనా వైరస్ థర్డ్ వేవ్‌... భారత్ సహా అనేక దేశాల్లో కేసుల్లో అనూహ్య పెరుగుదల..!
   ఫ్రాన్స్‌లో థర్డ్ వేవ్..

  ఫ్రాన్స్‌లో థర్డ్ వేవ్..


  ఈ పరిస్థితుల మధ్య ఫ్రాన్స్.. కరోనా వైరస్ థర్డ్ వేవ్‌ బారిన పడింది. వారం రోజులుగా.. 25 వేల వరకు కొత్త పాజిటివ్ కేసులు అక్కడ నమోదవుతున్నాయంటే- దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఆరంభమైందని ఫ్రాన్స్ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ ప్రకటించారు. ఈ స్థాయిలో రోజువారీ కొత్త కేసులు నమోదు కావడం గత ఏడాది నవంబర్ తరువాత ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఆయన ఓ ప్రకటన చేశారు. మంగళవారం ఒక్కరోజే 29,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

  రికవరీ రేటు తక్కువ..

  రికవరీ రేటు తక్కువ..

  కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 41,08,108 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 91,170 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఇప్పటిదాకా 2,75,360 మంది మాత్రమే రికవరీ అయ్యారు. 37,41,578 యాక్టివ్ కేసులక్కడ కొనసాగుతున్నాయి. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 62,838 మందికి వైరస్ సోకింది. రికవరీ రేటు తక్కువగా నమోదయ్యే దేశాల జాబితాలో చేరింది ఫ్రాన్స్. మెక్సికో, బెల్జియం వంటి దేశాల్లో మరణాల రేటు అధికంగా ఉంటోంది. వ్యాక్సినేషన్ కొనసాగుతోన్నప్పటికీ.. మిగిలిన దేశాల స్థాయిలో వేగం పుంజుకోవట్లేదు.

  ఆంక్షలు అవసరం..

  ఆంక్షలు అవసరం..


  కొత్త కేసులు భారీగా పెరుగుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలను విధించాల్సిన అవసరం ఏర్పడిందని జీన్ కార్టెక్స్ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే.. ఆంక్షలు విధించక తప్పకపోవచ్చని అన్నారు. లాక్‌డౌన్ విధించే అవకాశాన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ ప్రొటోకాల్‌ను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని సూచించారు. మాస్క్‌లను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉండగలమని, వాటిని పాటించాలని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల మరోసారి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావొచ్చని అన్నారు.

  లక్షకు పైగా కరోనా మరణాలు నమోదైన దేశాల లిస్ట్

  లక్షకు పైగా కరోనా మరణాలు నమోదైన దేశాల లిస్ట్

  లక్షకు పైగా మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో, బ్రిటన్‌, ఇటలీ ఉన్నాయి. అత్యధిక మరణాలు నమోదైంది అమెరికాలోనే. ఇప్పటిదాకా అక్కడ 5,49,367 మంది మరణించారు. పాజిటివ్ కేసుల సంఖ్య మూడు కోట్లను దాటేశాయి.ఇప్ పటిదాకా 3,01,92,200 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రెజిల్‌-2,82,400, భారత్-1,59,079, మెక్సికో-1,94,944, బ్రిటన్-1,25,690, ఇటలీ-1,03,001 మంది కరోనాకు బలి అయ్యారు.

  English summary
  French Prime Minister Jean Castex told Parliament on Tuesday that France had entered a third wave of the Covid-19 pandemic, as the seven-day average of new cases rose above 25,000 for the first time since November 20.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X