వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతో పెట్టుకుంటే ఎవ్వరికైనా ఇదే గతి: ఇస్లామిక్ స్టేట్

|
Google Oneindia TeluguNews

ఇరాక్: తమ మీద బాంబు దాడులు చేస్తున్నంత వరకు తాము ప్రతిదాడులకు దిగుతామని, ఎవ్వరినీ నిద్రపోనివ్వమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హెచ్చరించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరిగిన దాడులు కేవలం అరంభం మాత్రమే అని చెప్పారు.

మున్ముందు తమ మీద దాడులు చేస్తున్న దేశాలకు తగిన బుద్ది చెప్పి పగ తీర్చుకుంటామని పేర్కొంది. మహమ్మద్ ప్రవక్తను అవమానించే దేశాలలో దాడులు చేస్తామని హెచ్చరించారు. తమ ఆధీనంలో ఉన్న ఇరాక్, సిరియాలోని ప్రాంతాలలో ఫ్రాన్స్ వైమానిక దాడులు చేసిందని అన్నారు.

French aircraft have attacked the Syrian stronghold of IS.

తమ మీద బాంబు దాడులు చేసినందుకే పక్కా ప్లాన్ తో ప్యారిస్ నగరంలో తాము దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. ఇకనైన తమ మీద దాడులు చెయ్యడం వదులుకోవాలని లేదంటే మళ్లి ఫ్రాన్స్ లో దాడులు తప్పవని సంకేతాలు ఇచ్చారు.

ఇస్లామిక్ స్టేట్ స్థావరాల మీద బాంబు దాడులు చేసే అన్ని దేశాలకు త్వరలో తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. మాతో పెట్టుకునే ఏ దేశానికైనా ఫ్రాన్స్ కు పట్టిన గతే పడుతుందని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు.

English summary
Iraqi intelligence sent dispatch saying Abu Bakr al-Baghdadi had ordered an attack on coalition countries fighting against them in Iraq and Syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X