వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాంగ్ బ్లాక్ స్కర్ట్ ధరించిందని క్లాస్ నుండి అమ్మాయి బ్యాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: లాంగ్ బ్లాక్ స్కర్ట్ ధరించి పాఠశాలకు వచ్చినందుకు ఓ ముస్లీం విద్యార్థిని పాఠశాల నుండి రెండుసార్లు బ్యాన్ చేసిన సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. పదిహేనేళ్ల ముస్లీం బాలిక స్కర్ట్ ధరించి పాఠశాలకు వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం, ఇది సరికాదని, ఈ వేషధారణలో రావొద్దని ఆమెను రానివ్వలేదు.

ఆమె తరగతి గదిలోకి వెళ్తుండగా హెడ్ టీచర్ ఆమెను ఆపారు. ఆమె లాంగ్ స్కర్ట్ వేసుకొని వచ్చినందుకు ఆపారని తెలుస్తోంది. ముస్లీం మహిళలు సహజంగా ఏమాత్రం శరీరం కనిపించకుండా దుస్తులు వేసుకుంటారు. పాఠశాలల సెక్యులర్ చట్టాల ప్రకారం కొన్ని దుస్తులను బ్యాన్ చేశారు.

French Muslim girl banned from class for wearing long skirt

ఆ యువతిని మరో డ్రెస్‌తో పాఠశాలకు రావాలని తిప్పి పంపించామని, కానీ వారి తండ్రి ఆ అమ్మాయిని తిరిగి పాఠశాలకు పంపించలేదని స్కూల్ యాజమాన్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. 2004 ప్రభుత్వ చట్టాల ప్రకారం.. కొన్నింటిని బ్యాన్ చేశారు.

దీనిపై ఆ బాలిక స్పందిస్తూ... తన స్కర్ట్ సాధారణంగానే ఉందని, ఇందులో ఎలాంటి ప్రత్యేకం లేదని చెప్పారు. ఏ రకమైన చిహ్నాలు కూడా లేవని చెప్పారు. ఈ అంశంపై సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

English summary
Muslim girl banned from class for wearing long skirt in France.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X