• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Interesting:కరోనా మరణాల నుంచి ట్వీట్ల వరకు: ట్రంప్ హయాంలో గణాంకాలు

|

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో వైట్‌హౌజ్‌ను వీడనున్నారు. ఈ క్రమంలోనే తన హయాంలో అమెరికా ఏం సాధించింది... ట్రంప్ పాత్ర ఏంటనేదానిపై గణాంకాలు మాట్లాడుతున్నాయి. 2017 నుంచి అధికారంలో ఉన్న ట్రంప్... ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్నారు. తన విధానాలపై కూడా పలు విమర్శలు కూడా వచ్చాయి. కరోనావైరస్ మరణాల నుంచి తాను అమితంగా ఇష్టపడే మెక్సికో సరిహద్దు గోడపై చేసిన ట్వీట్ల వరకు అన్నీ గణాంకాలే మాట్లడతాయి. ట్రంప్ హయాంలో కొన్ని గణాంకాలు , ఆ గణాంకాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం.

అందాలతో ఆకట్టుకొంటున్న దివ్య దురైసామి.. ఒంపు సొంపులతో..

3,22,000 +: కరోనావైరస్ మృతుల సంఖ్య. ట్రంప్ ఇంకా కొన్ని రోజుల పాటు ఉంటారు కాబట్టి ఇంకా ఈ సంఖ్య ఎంత పెరుగుతుందో చూడాలి

From Covid death toll to border wall:Here is What numbers say about US in Trumps Tenure

6: ట్రంప్ హయాంలో కరోనావైరస్ కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌లు

2: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్‌ మరియు బయోఎన్‌టెక్, మోడర్నా టీకాలకు ట్రంప్ సర్కార్ ఆమోదం తెలిపింది.

3: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య.6-3తో సంప్రదాయవాద మెజార్టీని ఏర్పాటు చేశారు

221: న్యాయవ్యవస్థలో చేరిన ఫెడరల్ ట్రయల్ స్థాయి మరియు అప్పీల్ కోర్టు జడ్జీల సంఖ్య

3.1 ట్రిలియన్ డాలర్లు: 2020లో లోటు బడ్జెట్. అమెరికా చరిత్రలోనే ఈ స్థాయిలో లోటు బడ్జెట్ ఉండటం తొలిసారి.

3: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో మూడు సార్లు ట్రంప్ భేటీ అయ్యారు. సింగపూర్, వియత్నాం, కొరియా సరిహద్దుల్లో ఓ సారి

21 ట్రిలియలన్ డాలర్లు: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి అమెరికా ఒక నెలలో అప్పుల స్థాయిని మించింది

4: ఒక ప్రభుత్వంలో అత్యధికంగా నలుగురు వ్యక్తులు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇది ట్రంప్ హయాంలో జరిగింది

203: ఒక డిఫెన్స్ సెక్రటరీ లేకుండా 203 రోజుల పాటు పెంటగాన్ ఆపరేట్ అయ్యింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి

450: ట్రంప్ హయాంలో ప్రారంభమైన 450 మైళ్ల మేరా ఉన్న అమెరికా - మెక్సికో సరిహద్దు గోడ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని అంచనా

4: నాలుగు అంతర్జాతీయ ఒప్పందాలను ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఇందులో ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ ఒప్పందం, ఒపెన్ స్కైస్ ట్రీటీ, ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ నుంచి తప్పుకున్నారు

13: ట్రంప్ హయాంలో 13 మందిని ఉరితీయడం జరిగింది. 130 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి హయాంలో ఇంతమందిని ఉరితీసింది లేదు. తాను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే వరకు అంటే వచ్చే జనవరి 20వ తేదీ వరకు ఇంకా ఉరిశిక్షలు అమలు చేసే వీలుంది

315: అమెరికా అధ్యక్ష హోదాలో గోల్ఫ్ కోర్స్‌ను ట్రంప్ 315 సార్లు సందర్శించారు

418: తన సొంత ఆస్తులను 418 సార్లు అధ్యక్ష హోదాలో సందర్శించారు

1: అమెరికా మిలటరీ మరో అనుబంధ సంస్థ స్పేస్ ఫోర్స్‌ ఏర్పాటు

15శాతం: చైనాతో వాణిజ్యపరంగా తగ్గుదల. జపవరి - సెప్టెంబర్ 2020 మధ్య తగ్గిన వాణిజ్యం. 2019లో ఇది 19శాతం పడిపోగా 308 బిలియన్ డాలర్లు మేరా తగ్గిపోయింది. 2013 నుంచి ఈ స్థాయిలో వాణిజ్యం పడిపోవడం ఇదే తొలిసారి

25,000: ట్రంప్ 2017 జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చేసిన ట్వీట్లు రీట్వీట్ల సంఖ్య. జనవరి 20 వతేదీ వరకు ఇంకా సమయం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

English summary
Trump's presidency is reflected in a broad range of numbers representing everything from the U.S. death toll during the coronavirus pandemic to the miles of his “big, beautiful wall” along Mexico.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X