వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉబెర్ డ్రైవర్ నుంచి ఉగ్రవాదిగా.. 8మంది ప్రాణాలు తీసిన సైపుల్లా, అంతకుముందు ఇలా..

న్యూయార్క్‌లోని లోయర్ మాన్‌హట్టన్‌లో ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు తీసిన నిందితుడు సైఫుల్లో సైపో కొన్నేళ్ల క్రితమే అమెరికాలో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేయడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

Recommended Video

New York Truck Incident : న్యూయార్క్ ట్రక్కు బీభత్సం: ఏడాది ప్లాన్

వాషింగ్టన్: న్యూయార్క్‌లోని లోయర్ మాన్‌హట్టన్‌లో ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు తీసిన నిందితుడు సైఫుల్లో సైపో కొన్నేళ్ల క్రితమే అమెరికాలో ఉబెర్ డ్రైవర్‌గా పనిచేయడం గమనార్హం. అతడు ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కేంట్‌ నుంచి 2010లో అమెరికాలోని ఒహియోకు వలసవచ్చినట్లు తేలింది. అప్పట్లో ఇతనికి ఇంగ్లిష్‌ కూడా రాదు.

తొలిరోజుల్లో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన ఇంగ్లీష్ భాషను మెరుగుపర్చుకున్నాడు. అంతేగాక, ఇతనికి రాత్రివేళ బాగా ఆలస్యంగా నిద్రించే అలవాటుంది. కొన్నాళ్లకు ఫోర్ట్‌మేయర్స్‌కు వలస వెళ్లాడు. అక్కడ ఉజ్బెకిస్థాన్‌ నుంచి వలసవచ్చిన మరో వ్యక్తితో కలిసి ఉన్నాడు.

 ఉబెర్ డ్రైవర్‌గా..

ఉబెర్ డ్రైవర్‌గా..

అప్పట్లో కొన్నాళ్లు ట్రక్‌ డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే న్యూజెర్సీలోని పీటర్సన్‌కు మకాం మార్చాడు. అక్కడ ఉబర్‌ సంస్థలో డ్రైవర్‌గా చేరాడు. ఆ తర్వాత సైఫుల్లో గ్రీన్‌కార్డును కూడా సాధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

 సహకరిస్తామన్న ఉబెర్..

సహకరిస్తామన్న ఉబెర్..

మరోపక్క సైఫుల్లో ఉగ్రదాడిపై ఉబర్‌ అధికారులు స్పందించారు. ఉద్యోగంలో చేర్చుకునేముందు అతని నేపథ్యాన్ని ఉబర్‌ పూర్తిగా పరిశీలించిందని పేర్కొంది. దీంతోపాటు ఎఫ్‌బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.

 అప్పుడలా కనిపించలేదు..

అప్పుడలా కనిపించలేదు..

ఇది ఇలా ఉండగా, సైపో అరెస్టు తర్వాత అతని ఒకప్పటి సహచరుడు ఇరవై రెండేళ్ల బెఖ్జోద్‌ అబ్దుసమటోవ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు అమెరికా వచ్చిన మొదట్లో తమ వద్దే ఉన్నాడని తెలిపాడు. అతడు అమెరికాను బాగా ఇష్టపడతాడని, ఇక్కడ ఉండటాన్ని అదృష్టంగా భావించేవాడని బెఖ్జోద్‌ తెలిపాడు. అతను అప్పట్లో అసలు ఉగ్రవాదిలా అనిపించలేదని తెలిపాడు.

మన్‌హటన్‌లో ట్రక్కు బీభత్సం, 8 మంది మృతి: ఉగ్రదాడే అన్న మేయర్మన్‌హటన్‌లో ట్రక్కు బీభత్సం, 8 మంది మృతి: ఉగ్రదాడే అన్న మేయర్

 అల్లాహు అక్బర్ అంటూ మారణహోమం..

అల్లాహు అక్బర్ అంటూ మారణహోమం..

లోయర్‌ మాన్‌హట్టన్‌లో దాడికి ఉపయోగించిన ట్రక్కును సైపో మంగళవారమే న్యూజెర్సీలో అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ట్రక్కుతోనే విచక్షణారహితంగా జనాలపైకి దూసుకెళ్లి మారణహోమం సృష్టించాడు. దాడి సమయంలో అతని నుంచి ‘అల్లాహు.. అక్బర్‌' అనే మాటలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దాడికి పాల్పడిన వెంటనే పోలీసులు సైపుల్లోపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో గాయపడిన నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత పోలీసులు అతడ్ని విచారించే అవకాశం ఉంది.

English summary
Mr. Saipov, the suspect in the terrorist attack in Lower Manhattan that killed eight people on Tuesday, arrived from Tashkent — the Uzbek capital and its largest city — knowing little English, Mr. Abdusamatov said.Mr. Saipov eventually settled in Paterson and began driving for Uber.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X