వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ వేళ భారీ పేలుళ్లు: 46 మంది మృతి, 50 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

డమస్కస్: సిరియాలో మరోసారి పేలిన బాంబులు అనేక మంది ప్రాణాలు తీశాయి. పెట్రోల్ ట్రక్‌తో బాంబులు పేల్చడంతో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు గాయాలపాలయ్యారు. రంజాన్ పర్విదినం పురస్కరించుకుని వివిధ దుకాణాల్లో ప్రజలు కొనుగోళ్లు జరుపుతుండగా ఈ దాడి జరిగింది. దీంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది.

మృతుల్లో పది మందికిపైగా చిన్నారులు కూడా ఉన్నారు. పేలుళ్లు జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సిరియా సివిల్ డిఫెన్స్ వర్కర్స్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

A fuel truck bomb in a market in northern Syria killed at least 46 people.

కాగా, ఈ దాడిలో టర్కీకి చెందిన కొంత మంది ప్రో సిరియా టర్కీ ఫైటర్స్ కూడా మరణించినట్లు తెలిసింది. దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ కూడా అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. అఫ్రిన్ పట్టణంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఆ దేశ మంత్రిత్వ్వశాఖ ట్విట్టర్‌లో తెలిపింది.

ఈ దాడికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఒక వీడియోను కూడా పోస్టు చేసింది. ఆ వీడియోలు వరుసగా వాహనాలు వెళ్తుండగా ఒక్కసారిగా పెట్రోల్ ట్రక్ పేలడంతో భారీగా విధ్వంసం జరిగింది. ఈ దాడికి పాల్పడిన వైపీజీ ఉగ్రవాదులపై పోరు మరింత ముమ్మరం చేసింది సిరియా. ఉగ్రవాద దాడిని అమెరిక ఖండించింది. పవిత్ర రంజాన్ సమయంలో దాడులు చేయడం సమంజసం కాదని పేర్కొంది.

English summary
A fuel truck bomb in a market in northern Syria killed at least 46 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X