హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రిస్బేన్‌లో మోడీ 'హైదరాబాద్', ప్రధానికి జీ-20 సై

By Srinivas
|
Google Oneindia TeluguNews

బ్రిస్బెన్: భారత్ - ఆస్ట్రేలియా మధ్యేకాకుండా ఇరు దేశాల్లోని రాష్ట్రాలు, నగరాల మధ్య కూడా విస్తృతస్థాయి సాన్నిహిత్యం పెంపొందుతోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఆస్ట్రేలియాలో ఆధునిక టెక్నాలజీకి బ్రిస్బేన్ ఏవిధంగా మూలకేంద్రంగా కొనసాగుతోందో, భారత్‌లోని హైదరాబాద్ మహానగరం సైబరాబాద్‌గా టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కిస్తోందన్నారు.

రెండునగరాల మధ్య టెక్నాలజీ పరంగానూ, అభివృద్ధి విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని స్పష్టం చేశారు. ఈ నగరాలు సోదరి సంబంధం కలిగిన ప్రాంతాలుగా అభివర్ణించిన మోడీ.. రాష్ట్రాలు, నగరాల మధ్య కూడా సంబంధాలు పెంపొందించే దేశాలు త్వరితగతిన ప్రగతి సాధించగలుగుతాయని, మెరుగైన మైత్రి ఏర్పరచుకో గలుగుతాయని వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాలు, నగరాలు కూడా ఈరకమైన అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. భారత్ - క్వీన్స్‌లాండ్ మధ్య టెక్నాలజీ నుంచి పరిశోధనల వరకు, అలాగే వనరుల పంపిణీ వరకూ ఎన్నో రకాలుగా లోతైన ద్వైపాక్షిక బంధం ఉందన్నారు. క్వీన్స్‌లాండ్‌కు చెందిన అనేక వ్యాపార బృందాలు భారత సందర్శనకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. భారత్ అభివృద్ధికి క్వీన్స్‌లాండ్ కీలకమైన కేంద్రంగా మారిందని వెల్లడించారు.

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆదివారం నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆదివారం నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆదివారం నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆదివారం నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని తేరిపారా చూస్తున్న మోడీ.

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆదివారం నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహం వద్ద మోడీ, ప్రవాస భారతీయులు, తదితరులు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆదివారం నాడు బ్రిస్బన్ మేయర్ తదితరులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత ప్రధానమంతిర నరేంద్ర మోడీ పాల్గొన్నప్పటి దృశ్యం.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆదివారం నాడు బ్రిస్బన్ మేయర్ తదితరులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత ప్రధానమంతిర నరేంద్ర మోడీ పాల్గొన్నప్పటి దృశ్యం. సాంస్కృతిక ప్రదర్శన

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆదివారం నాడు బ్రిస్బన్ మేయర్ తదితరులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత ప్రధానమంతిర నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆదివారం నాడు బ్రిస్బన్ మేయర్ తదితరులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత ప్రధానమంతిర నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీతే కరచాలనం చేసేందుకు ప్రవాస భారతీయుల ఉత్సాహం.

నరేంద్ర మోడి

నరేంద్ర మోడి

ఆదివారం నాడు బ్రిస్బన్ మేయర్ తదితరులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత ప్రధానమంతిర నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీతే కరచాలనం చేసేందుకు ప్రవాస భారతీయుల ఉత్సాహం.

మోడీ మాటకు సై

అవినీతిపై జి-20 ధనిక, వర్థమాన దేశాల శిఖరాగ్ర సదస్సు సమరశంఖం పూరించింది. పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న కంపెనీలు, ట్రస్టులు సహా అవినీతికి పాల్పడే అందరిపైనా ఉమ్మడి పోరు సాగించాలని పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ సమగ్ర కార్యాచరణ చేపట్టాలని రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా ఆదివారం నాడిక్కడ ఉద్ఘాటించింది.

వృద్ధి, అంతర్గత శక్తికి దోహదం చేసే అవినీతి నిరోధక కార్యాచరణను ఆమోదిస్తున్నట్టు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. అవినీతి నిరోధక ప్రయత్నాల్లో పరస్పరం సహకరించుకోవాలని, అవినీతి సొమ్ము రహస్యంగా ఎటూ తరలిపోకుండా నిఘాతో వ్యవహరించాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని, అక్రమంగా తరలించిన నిధులను వెనక్కి రప్పించుకునేందుకూ వ్యవస్థాగత ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అవినీతి నిరోధక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

జి-20 సదస్సులో నల్లధనం అంశానికి సంబంధించి భారత్ వాదనకు బలమైన మద్దతు లభించింది. ఇలాంటి వ్యవహారాల్లో పారదర్శకతను పాటించాలని, అక్రమ ఖాతాల వివరాలను వెల్లడించాలంటూ మోడీ ఇచ్చిన పిలుపునకు జి-20 సదస్సు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ వ్యవహారంలో ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోడీ ఉద్ఘాటించారు.

ముఖ్యంగా పన్నుల రాయితీలను కల్పిస్తూ, అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న దేశాలు రహస్య ముసుగును తొలగించి ప్రపంచ దేశాలతో ముఖ్యంగా నల్లధనం బాధిత దేశాలతో సహకరించాల్సిన అవసరం ఎంతో వుందని మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను, ఒడంబడికలను త్రికరణశుద్ధిగా అన్ని దేశాలు అమలుచేయగలిగితేనే ఈ నల్లధనం జాడ్యాన్ని రూపుమాపడం సాధ్యమవుతుందని మోడీ అన్నారు. దీనివల్ల విదేశాల్లో మేటవేసిన అక్రమ సంపాదనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుందన్నారు.

సిడ్నీకి మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ బ్రిస్బేన్ నుండి సిడ్నీ చేరుకున్నారు. సోమవారం సిడ్నీలోని ఒలింపిక్ పార్క్‌లో నిర్వహించే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. మోడీ సభకు 16వేల మంది భారతీయులు హాజరు కానున్నారు.

మోడీ ఎక్స్‌ప్రెస్

ఆస్ట్రేలియాలో మోడీ ఎక్స్ ప్రెస్... మెల్‌బోర్న్ నగరం నుంచి సిడ్నీ చేరుకుంది. సిడ్నీలో మోడీ నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరయ్యేందుకు మెల్‌బోర్న్‌లోని ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా మోడీ ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియలో తొలిసారిగా ఓ వ్యక్తి పేరిట పరుగులు పెట్టిన ఈ రైలును ఆస్ట్రేలియా మంత్రి మాథ్యూ గై ఆదివారం జెండా ఊపి ప్రారంభిచారు. 220 మది ప్రవాస భారతీయులు ఈ ప్రత్యేక రైలులో మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ చేరుకున్నారు. మోడీ పేరిట ఏర్పాటైన ఈ రైలులో ప్రయాణించిన వారికి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు చెందిన సంప్రదాయక వంటకాలతో ఉచితంగా రుచికర భోజనాన్ని నిర్వాహకులు అందించారు.

English summary
As India makes attempts to recover black money from abroad, Prime Minister Narendra Modi on Sunday asked every country, especially tax havens, to provide information for tax purposes in accordance with treaty obligations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X