వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక అంశాలపై చర్చ .. ట్రంప్, అబేతో మోడీ భేటీ

|
Google Oneindia TeluguNews

ఒసాకా : జీ-20 సదస్సులో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమవుతారు. ఈ త్రైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలు చర్చకొస్తాయి. సదస్సులో పాల్గొనేందుకు మంగళవారమే మోడీ జపాన్‌లోని ఒసాకో నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్న లాంఛనంగా జీ-20 సదస్సు ప్రారంభమైంది.

కీ డిస్కషన్స్ ..

కీ డిస్కషన్స్ ..

ఇండో ఫసిఫిక్ ప్రాంతలో మౌలిక వసతుల కల్పన మరింత వృధ్ది కోసం అమెరికా అధినేత ట్రంప్‌, జపాన్ ప్రధాని అబేతో మోడీ చర్చిస్తారు. ఈ సందర్భంగా సభ్యదేశంగా భారత్‌కు కావాల్సిన సాయం గురించి మోడీ వివరిస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ వర్గాలు ట్వీట్ కూడా చేశారు. జపాన్, అమెరికా, ఇండియా పేరును ‘జై'గా సంబోధిస్తూ చేర్చడం విశేషం. తమ తమ ఇబ్బందుల గురించి ముగ్గురు అధినేతలు చర్చించే అవకాశం ఉంది. దీంతో ఇరుదేశాల మధ్య సహకారం మరింత మెరుగవుతుందని అధినేతలు భావిస్తున్నారు. ఆ తర్వాత మోడీ ట్రంప్‌తో సమావేశమవుతారు. నిన్న షింజో అబేతో మోడీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కార్ల నుంచి బుల్లెట్ ట్రైన్ వరకు అన్నింటిలో కలిసి పనిచేస్తామని ఇరుదేశాల అధినేతలు డిస్కస్ చేసినట్టు మీడియాకు వివరించారు.

 ఇవీ కూడా ..

ఇవీ కూడా ..

ఇవాళ ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సమావేశమవుతారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కోసం అధినేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. తొలుత జపాన్ ప్రధాని షింబో అబేతో ట్రంప్ భేటీ అవుతారు. తర్వాత సమావేశానికి మోడీ హాజరవుతారు. ముగ్గురు కలిసి వివిధ అంశాలపై డిస్కస్ చేస్తారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు వాణిజ్యం, ఆర్థికపరమైన అంశాలపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. జీ-20 సమావేశంలో మహిళా సాధికారత, ఉగ్రవాద నిరోధం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించాలని మోడీ లేవనెత్తే అవకాశం ఉంది. వివిధ కీలక అంశాలకు ఒసాకాలో జరిగే జీ సమ్మిట్ పరిష్కారం లభిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఒసాకాలో లేవనెత్తిన కీలక అంశాలకు 2022లో భారత్‌లో నిర్వహించే సమ్మిట్ మంచి వేదిక అవుతుందన్నారు. కీలక సమస్యలకు చెక్ పెట్టడంతోపాటు .. మరింత పురోభివృద్ధి కోసం పాటుపడొచ్చని పేర్కొన్నారు. 2022లో భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే.

రేపు పుతిన్, జిన్‌పింగ్‌తో ...

రేపు పుతిన్, జిన్‌పింగ్‌తో ...

షింజో అబే, మోడీతో కీలక అంశాలపై శుక్రవారం మోడీ డిస్కస్ చేస్తారు. శనివారం రష్యా, చైనా అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జిన్ పింగ్‌తో భేటీ అవుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాతో ఇప్పటికే ఎస్ 400 క్షిపణి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. చైనాతో మాత్రం పాకిస్థాన్‌కు పరోక్ష మద్దతు, కారిడార్ సమస్యలకు సంబంధించిన అంశాలను మోడీ లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి.

English summary
Prime Minister Narendra Modi held extensive discussions on the Indo-Pacific region, improving connectivity and infrastructure development with US President Donald Trump and Japanese premier Shinzo Abe in Osaka Friday ahead of the formal opening of the G-20 Summit. During the Japan-America-India trilateral meeting, Modi highlighted "the importance India attaches to" the grouping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X