వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జి20 లో పాక్ దుమ్ముదులిపిన మోడీ, 11 పాయింట్ల యాక్షన్ అజెండా

జి20 సమ్మిట్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా పాకిస్తాన్ పైన మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం లక్ష్యాల కోసం కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని ఉపయోగించుకుంటున్నాయని మోడీ అన్నారు.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: జి20 సమ్మిట్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా పాకిస్తాన్ పైన మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం లక్ష్యాల కోసం కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని ఉపయోగించుకుంటున్నాయని మోడీ అన్నారు. లష్కరే తొయిబా, జైషే ఈ మహ్మద్‌, ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ ఖయిదా.. ఇలా ఉగ్రవాద సంస్థల పేర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటన్నింటి సిద్ధాంతాలు మాత్రం ఒకేలా ఉన్నాయన్నారు.

చదవండి: మీతో చర్చలా, ఎవరు అడిగారు?: చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్

తీవ్రవాదం విషయంలో అంతర్జాతీయ స్థాయిలో అనుకున్నంత స్పందన లేదని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదంపై 11 పాయింట్ల యాక్షన్ ఎజెండాను మోడీ జి20 సమ్మిట్‌లో ప్రవేశ పెట్టారు.

g20-summit-pm-modi-takes-veiled-swipe-at-pakistan-presents

- ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, ఆ దేశాలను జి20 నుంచి తొలగించాలి.

- జి20 దేశాలు తప్పనిసరిగా అనుమానాస్పద తీవ్రవాదుల జాబితాను పంచుకోవాలి.

- చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే అలాంటి వారిని ఆయా దేశాలకు రప్పించడంలో చట్టాలను సులభతరం చేయాలి.

- అంతర్జాతీయ తీవ్రవాదంపై సమగ్ర సమావేశం జరగాలి.

- ఉగ్రవాదంపై యూఎన్ఎస్సీ తీర్మానాలు, ఇతర అంతర్జాతీయ నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయాలి.

- ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ద్వారా ఉగ్రవాదానికి ఫైనాన్స్ చేసే అంశాలపై దృష్టి సారించాలి. తగ్గించాలి.

- ఎఫ్ఏటీఎఫ్‌తో పాటు వెపన్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్ యాక్ఠన్ టాస్క్ ఫోర్స్(డబ్ల్యుఈఏటిఎఫ్) ను ఏర్పాటు చేయడం ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు వెళ్లడాన్ని ఆపాలి.

- తీవ్రవాదుల కార్యకలాపాలపై దృష్టి సారించాలి. తద్వారా జి 20 దేశాలు సైబర్ సెక్యురిటీ విషయంలో పరస్పరం సహకరించుకోవాలి.

- నేషనల్ సెక్యరిటీ అడ్వయిజర్స్‌ను ఏర్పాటు చేయాలి. తదితర 11 కౌంటర్ టెర్రరిజం పాయింట్లు ప్రవేశ పెట్టారు.

English summary
In an apparent reference to Pakistan, Prime Minister Narendra Modi on Friday said some nations are using terrorism in order to achieve political goals while calling upon world leaders to show solidarity in fighting terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X