వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యం: గాల్వాన్‌పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్‌పై అక్కసు

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా సంబంధాలతోపాటు ప్రపంచ రాజకీయాలనూ తీవ్రంగా ప్రభావితం చేసిన 'గాల్వాన్ ఘర్షణ'పై డ్రాగన్ దేశం ఎట్టకేలకు పశ్చాత్తాపం చెందింది. 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గాల్వాన్ ఘర్షణను చరిత్రలోనే దురదృష్టకర సంఘటనగా చైనా అభివర్ణించింది. అయితే, ఇప్పటికీ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లకపోవడం, మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'పై అక్కసు వెళ్లగక్కడం చైనా ద్వంద్వనీతికి నిదర్శనంగా నిలిచింది.

చెంపలేసుకున్న శ్రీలంక - చైనాతో ఒప్పందం భారీ తప్పిదం - ఇకపై 'ఇండియా ఫస్ట్' పాలసీ -నమ్మొచ్చా?చెంపలేసుకున్న శ్రీలంక - చైనాతో ఒప్పందం భారీ తప్పిదం - ఇకపై 'ఇండియా ఫస్ట్' పాలసీ -నమ్మొచ్చా?

వీడాంగ్ అనూహ్య వ్యాఖ్యలు..

వీడాంగ్ అనూహ్య వ్యాఖ్యలు..

గడిచిన మూడు నెలలుగా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతున్నది. తూర్పు లదాక్ లోని పలు ప్రాంతాల్లో తిష్టవేసిన డ్రాగన్ సైన్యాలు.. భారత జవాన్లకు అడ్డు తగులుతూ కవ్వింపులకు దిగాయి. ఈ క్రమంలో జూన్ 15న గాల్వాన్ లోయలోని 14వ పెట్రోలింగ్ పాయింట్ వద్ద హిసాత్మక ఘర్షణ జరగ్గా, మన జవాన్లు 20మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా సైన్యం ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు. రెండు దేశాల సంబంధాలపై పెను ప్రభావం చూపిన ఆ ఘటన జరిగిన రెండున్నర నెలల తర్వాత.. భారత్ లో చైనా రాయబారి సన్ వీడాంగ్ గాల్వాన్ ఘర్షణపై అనూహ్య వ్యఖ్యలు చేశారు. నాటి ఘర్షణను దురదృష్టకర సంఘటనగా ఆయన పేర్కొన్నారు.

అలాంటివి మళ్లీ వద్దు..

అలాంటివి మళ్లీ వద్దు..

‘‘గాల్వాన్ లాంటి దురదృష్టకర ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవరముంది. అందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఘర్షణ తర్వాత తలెత్తిన ఉద్రిక్తతను నివారించడానికి సైనిక, దౌత్య మార్గాల్లో పలు దఫాల చర్చలు జరిపాం. ఆర్థిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న మన రెండు దేశాల మధ్య పరస్పర సహకారం అత్యవసరం'' అని వీడాంగ్ అన్నారు. ‘ఇండియా-చైనా యూత్ ఫోరం' ఇటీవల నిర్వహించిన వెబినార్ లో ఆయనీ కామెంట్లు చేసినట్లు ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ వెల్లడించింది.

ఇండియా అవకాశాల గని..

ఇండియా అవకాశాల గని..


సరిహద్దు సహా అన్ని వివాదాలకు స్వస్తి పలికి రెండు దేశాలూ అభివృద్ధి బాటలో నడవాల్సిన అవసరం ఉందన్న వీడాంగ్.. భారత్ ను చైనా ప్రత్యర్థిగా చూడటం లేదని, మిత్రదేశంగానే భావిస్తున్నదని, ముప్పుగా కాకుండా అవకాశాల గనిగా పరిగణిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్ర పొడవునా చైనా, భారత్ మధ్య నెలకొన్న బలమైన బంధాలు.. ఇప్పటి ప్రతికూలతను పరిష్కరించుకునేందుకు దోహదపడతాయని వీడాంగ్ చెప్పారు. అయితే..

 ఆత్మనిర్భర్‌పై అక్కసు..

ఆత్మనిర్భర్‌పై అక్కసు..

గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్న భారత ప్రభుత్వం.. డ్రాగన్ ఆర్థిక మూలాలపై దెబ్బపడే విధంగా ఆ దేశ కంపెనీలు, యాప్ లపై నిషేధం విధించడం, చైనా సహా విదేశీ ఉత్పత్తులపై ఆంక్షలు విధించడం, అదే సమయంలో స్వదేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేలా ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' ప్రకటించడం తెలిసిందే. చైనా రాయబారి సన్ వీడాంగ్ తన తాజా ప్రకటనలో ఆత్మనిర్భర్ పై అక్కసు వెళ్లగక్కారు. ‘‘ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి చెందడం సాధ్యంకాదు. గ్లోబలైజేషన్ క్రమంలో ఇతరులకూ తప్పనిసరిగా అవకాశం కల్సించాల్సిందే''అని వ్యాఖ్యానించారు.

చైనా ద్వంద్వనీతి..

చైనా ద్వంద్వనీతి..

ఓ దిక్కు భారత్ ను చైనా మిత్రుడిగానే చూస్తుందని ఇక్కడి రాయబారి చెబుతుంటే, సరిహద్దులో మాత్రం డ్రాగన్ బలగాలు కవ్వింపులు మానడంలేదు. సైన్యాల ఉపసంహరణ(డీఎస్కలేషన్)కు అంగీకరించిన చైనా.. గాల్వాన్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లినట్లే నటించి, మళ్లీ దౌలత్ బేగ్ ఓల్టీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో మోహరింపులు పెంచింది. ఉద్రిక్తతల నివారణకు జరిగిన చర్చల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఈలోపే సరిహద్దు వెంబడి చైనా యుద్ధ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుండటంతో భారత్ సైతం దీటుగా స్పందిస్తున్నది. భుజం మీద పెట్టుకుని, గాలిలోని టార్గెట్ ను ఛేదించగల రష్యన్ మేడ్ క్షిపణుల్ని భారత్ సరిహద్దుకు తరలించింది.

షాకింగ్: చైనా యుద్ధ విన్యాసాలు రద్దు - పైనుంచి యూఎస్-2 రాకతో కలకలం- ఉల్లంఘనపై డ్రాగన్ ఫైర్షాకింగ్: చైనా యుద్ధ విన్యాసాలు రద్దు - పైనుంచి యూఎస్-2 రాకతో కలకలం- ఉల్లంఘనపై డ్రాగన్ ఫైర్

English summary
China's ambassador to India Sun Weidong dubbed the Galwan Valley clash that left 20 Indian soldiers dead an "unfortunate incident" that neither China nor India "would like to see". Sun also said that the violent clash that has soured relations between the two neighbours, was "a brief moment from the perspective of history".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X