వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతిపిత వర్ధంతి వేళ కాలిఫోర్నియాలో గాంధీ విగ్రహం ధ్వంసం .. ఇండో అమెరికన్ల తీవ్ర ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశమంతా దివంగత నేత మహాత్మా గాంధీని స్మరించుకుంటుంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇక ఈ ఘటన అమెరికా దేశంలో ఉన్న భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జాతిపిత విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేయాలని భారతీయ అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది కావాలని ద్వేషపూరితంగా చేసిన నేరమని వారు ఆరోపిస్తున్నారు.

డేవిస్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో ఉన్న గాంధీ విగ్రహం ధ్వంసం

డేవిస్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో ఉన్న గాంధీ విగ్రహం ధ్వంసం

ఉత్తర కాలిఫోర్నియాలోని డేవిస్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో ఉన్న 6 అడుగుల పొడవైన, 650-పౌండ్ల (294 కిలోల) కాంస్య విగ్రహం కాళ్ల వద్ద విరగ్గొట్టి కనిపించింది . విగ్రహంలో ముఖం భాగం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ధ్వంసమైన విగ్రహాన్ని పార్కు ఉద్యోగి కనుగొనడంతో అధికారులకు సమాచారం అందించారు. ఈ విగ్రహాన్ని తొలగిస్తున్నామని, దానిని సురక్షితమైన స్థలంలో భద్రపరుస్తామని డేవిస్ సిటీ కౌన్సిల్మన్ లూకాస్ ఫ్రీరిచ్స్ తెలిపారు.

భారత్ అమెరికాకు బహూకరించిన విగ్రహం .. విచారణ చెయ్యాలని కోరిన భారత్

భారత్ అమెరికాకు బహూకరించిన విగ్రహం .. విచారణ చెయ్యాలని కోరిన భారత్

ఉత్తర కాలిఫోర్నియాలో నాలుగేళ్ల కిందట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా పంపింది. శాంతి, సమన్యాయం కోసం పోరాడిన ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకున్న జాతిపిత విగ్రహం పై దాడి అమానుష చర్య అని అమెరికా సైతం వ్యాఖ్యానించింది .

ఈ ఘటన పట్ల అమెరికాలో ఇండో-అమెరికన్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారత్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి ఈ ఉదంతాన్ని తీసుకువెళ్లింది, విచారణ జరిపించాలని కోరింది.

 ఖలిస్తానీ వేర్పాటువాదుల పనే అని అనుమానం

ఖలిస్తానీ వేర్పాటువాదుల పనే అని అనుమానం

గాంధీ వ్యతిరేక మరియు భారత వ్యతిరేక సంస్థల నిరసనల మధ్య భారత ప్రభుత్వం డేవిస్ నగరానికి విరాళంగా ఇచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నాలుగు సంవత్సరాల క్రితం నగర కౌన్సిల్ ఏర్పాటు చేసింది.

ఈ నిరసనలకు నాయకత్వం వహించిన , విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన ఆర్గనైజేషన్ ఫర్ మైనారిటీస్ ఇన్ ఇండియా మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించే ప్రచారాన్ని ప్రారంభించింది.
చాలా సంవత్సరాలుగా భారత వ్యతిరేక మరియు హిందుఫోబిక్ రాడికల్ సంస్థలు ఆర్గనైజేషన్ ఫర్ మైనారిటీస్ ఇన్ ఇండియా, ఇతర ఖలిస్తానీ వేర్పాటువాదులు ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్ పేర్కొంది.

భారతీయ అమెరికన్ సమాజాన్ని భయపెట్టే ఉద్దేశంతోనే దాడి.. కఠిన చర్యలకు డిమాండ్

భారతీయ అమెరికన్ సమాజాన్ని భయపెట్టే ఉద్దేశంతోనే దాడి.. కఠిన చర్యలకు డిమాండ్

భారతీయ అమెరికన్ సమాజాన్ని భయపెట్టే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని ఇండో అమెరికన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలిఫోర్నియాలోని ఖలీస్తాన్ అనుకూల వేర్పాటువాద బృందం ఈ విధ్వంసాన్ని ట్విట్టర్లో ప్రశంసించింది, వారు ధ్వంసం చేసిన విగ్రహం యొక్క ఫోటోలను షేర్ చేసి ఈ రోజు మంచి రోజు అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం చేయటం పై సీరియస్ గా ఉన్న ఇంట్లో అమెరికన్లు, విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని,అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


గతేడాది ఇదే తరహాలో వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు అపవిత్రం చేశారు.

English summary
Mahatma Gandhi statue has vandalised, broken and ripped from the base in a park in the US state of California, shocking and outraging Indian-Americans across the country, demanded to investigate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X