• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్‌లో ఈ కండోమ్స్ వద్దు - అన్నీ వాడి పారేసినవే - నీళ్లలో మరగబెట్టి తిరిగి అమ్మకం - మహిళ అరెస్ట్

|

శృంగార కలాపంలో వాడి పారేసిన కండోమ్స్ ను సేకరించి, తూతూమంత్రంగా రీసైకిల్ చేసి, మళ్లీ కొత్తవాటిలా అమ్ముతూ సొమ్ము చేసుకుంటోన్న గ్యాంగును పోలీసు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు ఓ వేర్ హౌజ్ పై దాడులు నిర్వహించగా.. మొత్తం 3.50 లక్షల వాడిన కండోమ్స్ లభ్యమయ్యాయని, వాటి బరువు 350 వరకు ఉందని, విచారణ తర్వాతగానీ వాటి విలువను చెప్పలేమని పోలీసులు తెలిపారు.

డిల్డోతో షేపింగ్

డిల్డోతో షేపింగ్

వాడిన కండోమ్స్ ను తిరిగి కొత్తవాటిగా అమ్ముతోన్న ఈ వ్యవహారం వియత్నాంలో సంచలనం రేపుతున్నది. అక్కడి బిన్ దుంగ్ ఫ్రావిన్స్ లో చీకటి వ్యవహరం నడుపుతోన్న ముఠాను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. వాడి పారేసిన కండోమ్స్ ను సేకరించిన తర్వాత ముందుగా వేడి నీళ్లలో మరగబెడతారని, ఆ తర్వాత డిల్డో(పురుషాంగం ఆకారంలోని వస్తువు)కు తొడిగించి, పాత షేప్ వచ్చేలా చేస్తారని, చివరిగా సరికొత్త ప్యాకింగ్ తో వాటిని మార్కెట్లకు తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.

ఎస్పీ బాలు కోసం ఒక్కొక్కరుగా - ఆస్పత్రి వద్ద ఉద్విగ్నత - కమల్ సహా సన్నిహితుల రాక

ఇది తీవ్రనేరం..

ఇది తీవ్రనేరం..

కండోమ్ ను అన్ని దేశాల్లోనూ వైద్య సాధనంగాన పరిగణిస్తుండటం తెలిసిందే. దానిని వాడిన తర్వాత జాగ్రత్తగా డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా లక్షల కొద్దీ వాడేసిన కండోమ్ లకు సేకరించడం, వాటని రీసైకిల్ చేసి అమ్ముతుండటాన్ని తీవ్ర నేరంగానే పరిగణిస్తున్నామని వియత్నాం పోలీసులు చెప్పారు. వేర్ హౌజ్ లో పట్టుపడిన కండోమ్స్ సంఖ్యే ఇంత భారీగా ఉంటే, ఇప్పటికే అమ్ముడు పోయిన సరుకు ఎంత పరిమాణంలో ఉంటుందో ఊహిచడానికే అదోలా ఉందని, వాటి వల్ల సేఫ్టీకి సంబంధించి ప్రజలకు ఎలాంటి సమస్యలు తెత్తాయన్నది కూడా కలవరపెడుతున్నదని, ఏదిఏమైనా ఈ గ్యాంగ్ వెనకున్న అసలు సూత్రధారుల్ని సాధ్యమైనంత తొందర్లోనే పట్టుకుంటామని అధికారులు అన్నారు. ఇదిలా ఉంటే..

మంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకే

  Upasana Konidela Defective Condoms Dress Goes Viral | Dare to Wear Scrap ?
  మహిళ కీలక వాగ్మూలం..

  మహిళ కీలక వాగ్మూలం..

  వాడేసిన కండోమ్స్ ను రీసైక్లింగ్ చేస్తోన్న వ్యవహారంలో పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. వేర్ హౌజ్ లో తనిఖీలు చేపట్టిన సమయంలో ఆమె ఒక్కతే అక్కడున్నారు. అయితే, తాను కూలి కోసం పని చేసేదాన్నని, గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిత్యం కండోమ్ కట్టల్ని తీసుకొచ్చి, వేర్ హౌజ్ లో వదిలేసి వెళతారని, వాటిని రీసైక్లింగ్ చేసినందుకుగానూ కేజీల చొప్పున లెక్క కట్టి డబ్బులు ఇస్తారని ఆమె తెలిపారు. ఒక కేజీ కండోమ్స్ రీసైకిల్ చేస్తే 0.17 డాలర్లు (సుమారు 4వేల వియత్నమీ డాంగ్స్) ముట్టచెబుతారని ఆ మహిళ వివరించారు.

  English summary
  A gang that had allegedly been involved in selling used condoms in the market was busted in Vietnam. The police also seized around 3.50 lakh used condoms that were ready for sale. The contraceptives had been kept in several bags. The bags confiscated by the police weighed over 360 kilograms. The bags had been kept across the floor of a warehouse located in the southern province of Binh Duong.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X