వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గే యువకుల పెళ్లి.. అగ్రరాజ్యంలో మనువు, సొంత రాష్ట్రంలో ఆగ్రహావేశాలు, కులం నుంచి వెలి

|
Google Oneindia TeluguNews

గే.. ఇద్దరు కలిసి ఉండేందుకు సుప్రీంకోర్టు కూడా సమ్మతించింది. ఇష్టపూర్వకంగా కలిసి ఉండేందుకు.. పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిపింది. కానీ సనాతన హిందూ సంప్రాదాయంలో మాత్రం జీర్ణించుకోలేకపోతారు. ఇక ప్రత్యేక ఆచార, వ్యవహారాలు ఉన్నవారైతే అస్సలు ఒప్పుకొరు. అయితే కర్ణాటకకు చెందిన ఒకరు గే.. అమెరికాలో ఉంటున్నారు. అక్కడ మరో గే ను తమ కుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వరకు ఓకే.. కానీ ఫోటోలు దిగి వైరల్ కావడంతో.. విషయం కొడవ సామాజిక వర్గానికి తెలిసింది. తమ సామాజిక వర్గాన్ని కించపరిచారని అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

3 లక్షల మంది..

3 లక్షల మంది..

కర్ణాటకలో కొడవ సామాజిక వర్గం ఉంది. కొడగు జిల్లాలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది వరకు ఉంటారు. కొడగులో పుట్టిన కావేరి నదిని వారు దేవతగా పూజిస్తారు. కాఫీ తోటలు పండిస్తారు. నదులు, అడవులు, పర్వతాలు, కాలువల వద్ద ఉంటారు. ప్రత్యేక వేషధారణతో వేడుకలు నిర్వహించుకుంటారు. ఇతరులు అనుకరిస్తే అంగీకరించరు. పోయిన సంవత్సరం కొడగులో ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ కొడవ వేషధారణతో సర్వీస్ చేసింది. దీంతో హెచ్చరించడంతో.. రిసార్ట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఏకంగా కొడవు సంప్రదాయంలో గే పెళ్లి చేసుకోవడం వారి ఆగ్రహానికి కారణమయ్యింది.

శరత్ పొన్నప్ప.. గే

శరత్ పొన్నప్ప.. గే

కొడవ సామాజిక వర్గానకి చెందిన శరత్ పొన్నప్ప అమెరికాలో ఉంటున్నాడు. కాలిఫోర్నియాలో ఉంటోన్న సందీప్ దోసాంజిని ఇష్టపడ్డారు. వీరిద్దరూ ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. గతనెల 26వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అయితే కొడవ సంప్రదాయంలో వారి పెళ్లి జరిగింది. కానీ ఆ ఫోటోలు ఇలా.. అలా చేరి కర్ణాటకకు చేరాయి. కొడవ వేషధారణలో పెళ్లి జరగడంతో ఆ సామాజికవర్గం మండిపడుతోంది. శరత్‌పై ఒంటికాలిపై లేస్తోంది. తమ ఆచార, వ్యవహారాలను మంటగలిపారని ధ్వజమెత్తారు.

Recommended Video

Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Property & Net Worth Details || Oneindia Telugu
కులం నుంచి వెలి

కులం నుంచి వెలి

వీరి పెళ్లి ఖండిస్తున్నామని కొడవ సమాజ అధ్యక్షుడు కేఎస్ దేవయ తెలిపారు. కులానికి శరత్ మచ్చా తీసుకొచ్చాడని మండిపడ్డారు. ఇలాంటివి సహించబోమని.. కులం నుంచి శరత్ నుంచి వెలివేస్తున్నామని తెలిపారు. గతంలో ఇలాంటివి జరగలేదు.. కొత్తగా ఇలాంటి సాంప్రదాయానికి తెరతీశారని మండిపడ్డారు. శరత్ వల్ల మా కులానికి చెడ్డ పేరు వచ్చిందన్నారు. మరోవైపు కుల పెద్దలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయగా.. శరత్ మాత్రం అందుబాటులో లేరు. అతని పేరంట్స్ దుబాయ్‌లో ఉండగా.. వారు కామెంట్ చేయడానికి నిరాకరించారు.

English summary
gay youth sharath ponnappa, sandeep married in america in ‘kodava’ Tradition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X