వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: ప్రథాని థెరిస్సాకు 'ముందస్తు' షాక్, గెలిచిన సిక్కు మహిళ

బ్రిటన్‌ పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికలల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ, ప్రతిపక్ష లేబర్‌ పార్టీల మధ్య గట్టి పోటీ నడిచింది. పూర్తి మెజార్టీక

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్‌ పార్లమెంటుకు జరిగిన సార్వత్రిక ఎన్నికలల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ, ప్రతిపక్ష లేబర్‌ పార్టీల మధ్య గట్టి పోటీ నడిచింది. పూర్తి మెజార్టీకి కావాల్సిన 326 స్థానాలను ఏ పార్టీ కూడా దక్కించుకోలేదు.

కన్జర్వేటివ్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచింది. కన్జర్వేటివ్‌ పార్టీ 313 స్థానాలు గెలుచుకుంది. దీంతో ఇంకా 13 సీట్లు తక్కువ పడుతున్నాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీ 260 సీట్లు గెలిచింది.

 పుంజుకున్న లేబర్ పార్టీ

పుంజుకున్న లేబర్ పార్టీ

మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంట్‌లో 326 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. గత ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ 331 స్థానాలు గెలుచుకుంది. ఈసారి లేబర్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.

ముందస్తు బెడిసి కొట్టింది

ముందస్తు బెడిసి కొట్టింది

2016లో బ్రెగ్జిట్‌ అనంతరం డేవిడ్‌ కామెరాన్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. థెరిసా మే బాధ్యతలు చేపట్టారు. షెడ్యూల్‌ ప్రకారం తర్వాతి ఎన్నికలు 2020లో జరగాల్సిఉండగా, పార్లమెంట్‌లో తన బలం పెంచుకొవాలన్న లక్ష్యంతో మూడేళ్ల ముందుగానే థెరిసా మే ఎన్నికలకు పిలుపునిచ్చారు.

బ్రెగ్జిట్ సమర్థనకు..

బ్రెగ్జిట్ సమర్థనకు..


బ్రెగ్జిట్ సమర్థన కోసం కూడా మూడేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లారు. కానీ థెరిసా మేకు షాక్ తగిలింది. స్కాటీష్‌ నేషనల్‌ పార్టీ 34, లిబరల్‌ డెమోక్రాట్స్‌ 10 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 22 స్థానాల్లో విజయం సాధించారు.

బ్రిటన్‌లో ఎంపీగా గెలిచిన సిక్కు

బ్రిటన్‌లో ఎంపీగా గెలిచిన సిక్కు

బ్రిటన్ ఎన్నికల్లో సిక్కు మహిళ గెలుపొందారు. ప్రీత్ కౌర్ గిల్ లేబర్ పార్టీ తరఫున ఎడ్గ్‌బాస్టన్ నుంచి కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కరోలిన్ స్కెయిర్ పైన విజయం సాధించారు. ప్రీత్‌కు 24వేలకు పైగా ఓట్లు రాగా, ప్రత్యర్థికి దాదాపు 7వేల ఓట్లు వచ్చాయి. కాగా, లేబర్ పార్టీ 14 మందిని, కన్సర్వేటివ్ పార్టీ 13 మంది ఇండియన్స్‌ను పోటీలో ఉంచింది.

English summary
Hung parliament after Theresa May's disastrous night, gets its first female Sikh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X