వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జ్ యువర్ గ్రేట్: ప్రపంచాన్నే మార్చావు, కూతురు భావోద్వేగ వీడియో, నెటిజన్ల ఫిదా..

|
Google Oneindia TeluguNews

అమెరికా పోలీసు చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ కూతురు గియానా ఫ్లాయిడ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె నాన్న ప్రపంచాన్ని మార్చాడు అని చెబుతోన్న మాటలు వింటుంటే ప్రతీ ఒక్కరి కంటి నుంచి నీరు వస్తోంది. ఈ వీడియోను జార్జ్ స్నేహితుడు స్టీఫెన్ జాక్సన్ పోస్ట్ చేశారు. చిన్నారి వీడియో చూసిన నెటిజన్లు.. జాత్యాంహకార హత్యపై తమ గళం వినిపించారు.

 అమెరికాను అగ్నిగోళంలా మార్చేసిన జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టమ్ నివేదిక: షాకింగ్ అమెరికాను అగ్నిగోళంలా మార్చేసిన జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టమ్ నివేదిక: షాకింగ్

ఇటీవల జార్జ్ ప్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికాలో హత్యకు గురయ్యాడు. దీనిని నిరసిస్తూ స్టీఫెన్.. తన భుజాలపై గియానాను కూర్చొబెట్టుకొని వీడియో చేశాడు. నాన్న ఏం చేశాడు అని చిన్నారిని అడగగా... ప్రపంచాన్నే మార్చివేశాడు అని చిన్నారి చెప్పింది. రైట్ గియానా.. జార్జ్ ప్లాయిడ్ ది నేమ్ ఆఫ్ ఛేంజ్ అంటూ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో రాశాడు. ఆ వీడియో తెగ వైరలవుతోంది. ఆ చిన్నారి తండ్రి కోసం ఒక కన్నీటి బొట్టును రాల్చండి అంటూ రాస్తున్నారు. మరొకరు జాత్యాంహకార హత్యలు సరికాదు అని కామెంట్ చేస్తున్నారు.

george floyd changed world: daughter gianna floyd

ఇటీవల మిన్నే పోలీస్ పట్టణంలో జార్జ్ ఫ్లాయిడ్ మెడపై పోలీసు కాలితో తొక్కాడు. ఊపిరి ఆడటం లేదు అని చెప్పినా వినిపించుకోలేదు. అలా 7 నిమిషాలు జార్జ్ గొంతును మోకాలితో తొక్కడంతో జార్జ్ చనిపోయాడు. జార్జ్ హత్యను నిరసిస్తూ అమెరికా అట్టుడికిపోతోంది. హ్యాండ్స్ అప్, డోంట్ షూట్, నో జస్టిస్, నో పీస్ అంటూ హ్యుస్టన్ వీధుల్లో ర్యాలీలు తీస్తున్నారు. వైట్ హౌస్ వద్ద కూడా ఆందోళన చేయడంతో.. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ బంకర్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

English summary
george floyd changed world his daughter gianna floyd said. george friend stephen post vedio to social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X