• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్‌కు భారీ షాకిచ్చిన కూతురు, స్టాఫ్.. అమెరికా నిరసనల్లో మలుపు.. చనిపోయిన జార్జ్‌కు కరోనా

|

జాతి వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో కొనసాగుతోన్న నిరసనలు మలుపుతిరిగాయి. గత వారం రోజులుగా దాదాపు దేశమంతటా హింసాత్మక ఘటనలు, దుకాణాల లూటీలు యధేచ్ఛగా చోటుచేసుకోగా.. గుర్తుతెలియని దుండగులు వాషింగ్టన్ లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారు. నిరసనకారులపై స్థానికులే తిరగబడే పరిస్థితి ఏర్పడటం, చాలా చోట్ల దుకాణదారులు తమను తాము కాపాడుకోడానికి ఆయుధాలతో ఎదురుతిరగడం తదితర ఘటనలతో గురువారం నాటికి ఉద్యమం ఎట్టకేలకు శాంతి బాటపట్టింది.

నిరసనలకు అసలు కారణమైన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులోనూ కీలక మలుపు చోటుచేసుకుంది. ఇదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించనిరీతిలో ఎదురుదెబ్బలు తగిలాయి.

మన్సాన్ వివాదంపై సంచైత సంచలనం.. తండ్రి చితి ఆరకముందే.. ఆ ఇద్దరూ కలిసి చేశారంటూ..

ఐ కాంట్ బ్రీత్..

ఐ కాంట్ బ్రీత్..

మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపోలిస్ సిటీలో నల్ల జాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ (46)ను నకిలీ నోటు కేసులో అరెస్టుచేసే క్రమంలో అతని మెడపై తెల్లజాతి పోలీసులు మోకాలితో బలంగా అదమడంతో ఊపిరాడక చనిపోయాడు. చరిత్ర పొడవునా నల్లజాతీయులపై తెల్ల పోలీసులు సాగిస్తోన్న అరాచకంపై అమెరికా భగ్గున మండింది. మే 25న ఘటన చోటుచేసుకోగా, నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జార్జ్ చివరిమాట ‘ఐ కాంట్ బ్రీత్' ఇప్పుడు ప్రపంచ నినాదమైపోయింది. నిరసనలకు సంబంధించి అమెరికాలో ఇప్పటిదాకా సుమారు 10వేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. అయితే, అల్లర్లు, లూటీలు వద్దని మాజీ ప్రెసిడెంట్ ఒబామా తదితరులు హితవుపలికారు.

ఆ నలుగురూ హంతకులే..

ఆ నలుగురూ హంతకులే..

జార్జ్ మెడపై మోకాలితో అదిమిన డెరెక్ చావిన్ సహా అరెస్టులో పాలుపంచుకున్న మిగతా ముగ్గురు పోలీసులు థామస్ లేన్, అలెగ్జాండర్ కెంగ్, టోవ్ తావ్ లపైనా హత్య కేసు నమోదైంది. తొలుత డెరెక్ పై 3వ డిగ్రీ హత్య, మిగతా ముగ్గురిపై హత్యకు సహకరించారనే సెక్షన్ల కింద కేసులు నమోదుకాగా, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం నిందితులపై డిగ్రీలను బుధవారం అప్ గ్రేడ్ చేసింది. ప్రధాన ముద్దాయి డెరెక్ పై రెండో డిగ్రీ హత్య, మిగతా ముగ్గురు పోలీసులపై మూడో డిగ్రీ హత్య ఆరోపణలు నమోదు చేశారు. తద్వారా నలుగురినీ హంతకులుగా గుర్తించినట్లయింది. ఘటన జరిగిన రోజే ఉద్యోగాలు కోల్పోయిన ఆ నలుగురు ప్రస్తుతం జైలులో ఉన్నారు.

 విడాకులు కోరిన పోలీసు భార్య..

విడాకులు కోరిన పోలీసు భార్య..

‘‘సార్.. ప్లీజ్.. నాకు ఊపిరాడట్లేదు.. వదిలేయండి..''అని జార్జ్ ఫ్లాయిండ్ ఎంతగా ప్రాధేయపడినా కనీస మానవత్వం చూపించకుండా ఏకంగా 8నిమిషాల 46 సెకన్లపాటు అతని మెడపై మోకాలితో అదిమిపట్టిన పోలీస్ అధికారి డెరెక్ చావిన్.. అసలు మనిషేకాదంటూ విమర్శలు వచ్చాయి. గతంలోనూ నల్లజాతీయులపై దూకుడుగా వ్యవహరించినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. జార్జ్ హత్యతో డెరెక్ లోని క్రూరత్వం బయటపడటంతో ఇప్పుడతని భార్య కూడా విడాకులకు దరఖాస్తుపెట్టుకుంది. ఇంత దారుణానికి పాల్పడిన అతణ్ని జీవితాంతం క్షమించలేనంటూ డెరెక్ భార్య కెలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జంటకు పిల్లలు లేరు. అయితే కెలీకి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం ఉంది.

చైనా మరో దుర్మార్గం..గ్వాదర్‌లో సీక్రెట్‌గా నావికా స్థావరం.. శాటిలైట్ చిత్రాల్లో గుట్టురట్టు..

ప్రెసిడెంట్ గారూ మూసుకోండి..

ప్రెసిడెంట్ గారూ మూసుకోండి..

ఆందోళనల అణిచివేతకు ఆర్మీని రంగంలోకి దించుతానంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటనను ఏకంగా యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ తప్పుపట్టారు. ‘‘ఇదేమైనా రణరంగమా? నిరసనకారులపై ఆర్మీని ప్రయోగించాలన్న ఆలోచనను నేను వ్యతిరేకించాను. జార్జ్ ఫ్లాయిడ్ ది ముమ్మాటికీ హత్యే''అని మార్క్ మీడియాతో అన్నారు. హ్యూస్ట‌న్ సిటీ పోలీస్ చీఫ్ ఆర్ట్ అసివీదో మరో అడుగుముందుకేసి ట్రంప్ ను నోరుమూసుకోమని గదమాయించారు. "దేశంలోని పోలీస్ చీఫ్‌ల త‌ర‌ఫున ట్రంప్‌కు ఒక మాట చెబుతున్నా. అల్ల‌ర్లు స‌ద్దుమ‌ణిగేలా చెప్పేందుకు మీ ద‌గ్గ‌ర ఏమీ లేక‌పోతే.. నోరు మూసుకోండి. ఎందుకంటే మీరు యువ‌త‌ను ముప్పులోకి నెడుతున్నారు"అని అసివీదో వ్యాఖ్యానించారు.

ట్రంప్ కూతురి నిరసన..

ట్రంప్ కూతురి నిరసన..

జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంలో ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు కన్న కూతురు సైతం భారీ షాకిచ్చింది. న్యాయశాస్త్రంలో పట్టాపొందిన 26 ఏళ్ల టిఫనీ.. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై జరుగుతోన్న నిరసనలకు మత్తతుపలికారు. వైట్ హౌజ్ కు దూరంగా ఉంటోన్న ఆమె.. దేశంలో వివక్షను రూపుమాపాల్సిన అవసరముందంటూ బుధవారం ఓ వీడియో పోస్ట్ చేశారు. టిఫనీ.. ట్రంప్ రెండో భార్య మార్లా మాప్లెస్ కూతురు. ట్రంప్ పెద్ద కూతురు, మోస్ట్ ఫేమస్ ఇవాంకా తాజా నిరసనలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. కాగా, వైట్ హౌస్ ముందు నిరసనలు హింసాత్మకంగా మారడానికి కారణం ట్రంపే అని వెల్లడైంది. సివిల్ వార్ నాటి చర్చి ముందు ఆయన ఫొటోలు దిగాలనుకున్న ట్రంప్.. నిరసనకారుల్ని వెళ్లగొట్టాలని ఆదేశించారని, అప్పటికే శాంతియుతంగా నిరసన చేస్తున్నవాళ్లపై పోలీసులు దమనకాండ ప్రయోగించడంతో హింస చెలరేగినట్లు రిపోర్టులు వచ్చాయి.

  California earthquake : A magnitude 5.5 earthquake near Ridgecrest
  జార్జ్ కు కరోనా పాజిటివ్..

  జార్జ్ కు కరోనా పాజిటివ్..

  పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన హెన్నిపిన్ కౌంటీ మెడికల్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. పోస్టుమార్టం తర్వాత అతని కుటుంబీకుల అనుమతితో 20 పేజీల రిపోర్టును విడుదల చేశారు. జార్జ్ కు కరోనా వైరస్ సోకినా.. లక్షణాలు బయటికి కనబడలేదని, అయితే చనిపోయే సమయానికి ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయని, మరణించిన తీరునుబట్టి ఇది హత్యే అనడానికి తగిన ఆధారాలున్నట్లు చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ తెలిపారు.

  English summary
  President Donald Trump's youngest daughter Tiffany has extended her support to the massive protests in the United States against george floyd death. All four former officers involved in George Floyd's killing now face charges.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more