• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అట్టుడుకుతోన్నఅమెరికా: ఊపిరాడట్లేదు.. జార్జ్ ఫ్లాయిడ్‌పై గ్లోబల్ ఉద్యమం.. ట్రంప్‌ను ఆడేసుకున్న చైనా

|

''ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నవి తమ కోసం కాదని తెలిసినా.. వాటిపై నమ్మకం పెట్టుకుని.. న్యాయం దొరుకుతుందేమోనని పదే పదే ప్రయత్నించి మోసపోయేవాళ్లకు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్ప మరో దారి ఉండదు'' అంటూ అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని రెండు వాక్యాల్లో తేల్చేశారు క్రిస్టోఫర్ హారిస్‌. అతను జార్జ్ ఫ్లాయిడ్ జిగిరీ దోస్త్. పోలీసుల చేతుల్లో జార్జ్ చనిపోకముందు చివరిసారిగా మాట్లాడింది క్రిస్టోఫర్ తోనే. అమెరికాలో జాతి వివక్ష అధికంగా కనిపించే దక్షిణాది రాష్ట్రాల్లో మిన్నెసొటా ఒకటి. అక్కడి మినియాపోలిస్ సిటీలో నల్ల జాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ (46)ను తెల్లజాతి పోలీసులు హత్య చేసిన ఉదంతంపై అమెరికా వరుసగా ఆరోరోజు కూడా అట్టుడుకుతోంది. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.

  అట్టుడుకుతున్న అమెరికా.. అండర్‌గ్రౌండ్‌లో ట్రంప్!
  50 నగరాల్లో కర్ఫ్యూ..

  50 నగరాల్లో కర్ఫ్యూ..

  నల్ల జాతివారిపై పోలీసులు సాగిస్తోన్న అరాచకత్వానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా నిరసనలు హోరెత్తాయి. మే 25న మినియాపోలిస్ సిటీలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంచోటుచేసుకోగా, అదే రోజు రాత్రి నుంచి ఆందోళనలు చెలరేగాయి. రాజధాని వాషింగ్టన్ డీసీ మొదలు న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలస్ తదితర 50కిపైగా నగరాల్లో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో ఆయా నగరాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఫ్లాయిడ్ ఉదంతం కంటే ముందు ఎంతో మంది నల్లజాతీయుల్ని తెల్ల పోలీసులు పొట్టనపెట్టుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.

  ఎటుచూసినా మంటలే..

  ఎటుచూసినా మంటలే..

  కరోనా లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ రూల్స్ ను పక్కనపెట్టిమరీ జనం హక్కుల కోసం రోడ్లెక్కారు. అన్ని చోట్లా నల్ల జాతీయులతో కలిసి తెల్లవాళ్లూ నిరసనగళం విప్పారు. నిరసనకారుల్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు.. టియర్ గ్యాస్, పెప్పర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన జనం పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. చాలా నగరాల్లో కనిపించిన దుకాణాలను లూటీచేసి తగులబెట్టారు. ఏ నగరంలో చూసినా తగలబుతోన్న వాహనాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమర్జెన్సీ టైమ్ లో మాత్రమే వినియోగించే ‘నేషనల్ గార్డ్'ను ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఆందోళనల తీవ్రత ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాల్లో స్థానిక పోలీసులతోపాటు ఐదు వేల మంది నేషనల్ గార్డ్స్ ను మోహరించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా మెజార్టీ ప్రజలు నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటిదాకా వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. మినియాపోలిస్ లో నిరసనకారులపైకి ఓ ట్రక్కు దూసుకురావడం కలకలం రేపింది. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  ఇతర దేశాలకూ విస్తరణ..

  ఇతర దేశాలకూ విస్తరణ..

  జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంపై అమెరికాలో కొనసాగుతోన్న నిరసనలు ప్రపంచ దేశాలకూ విస్తరించాయి. బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో జాతి వివక్షకు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు. అరెస్టు సమయంలో పోలిసులను ప్రాధేయపడుతూ జార్జ్ పలికిన ‘‘ఊపిరాడట్లేదు (i cant breathe)'' అనే మాట ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగిపోతున్నది. గోడలపై, రోడ్లపై ఈ పదాన్ని రాస్తూ జనం తమ నిరసన తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇది వైరల్ అయింది. నల్ల జాతీయులు, ఇతర అణగారిన వర్గాల పట్ల ఏళ్లుగా కొనసాగుతోన్న వివక్షరూపాలు మాసిపోవాలని, ఆ మేరకు కొత్త చట్టాలు తేవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

  బంకర్‌లో ట్రంప్.. చైనా ఎద్దేవా..

  బంకర్‌లో ట్రంప్.. చైనా ఎద్దేవా..

  నల్ల జాతీయులపై హత్యాకాండను నిరసిస్తూ కొనసాగుతోన్న ఉద్యమ సెగ అధ్యక్ష భవనాన్ని కూడా తాకింది. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌజ్ కు సమీపంలో భారీ ఆందోళన, విధ్వంసం చోటుచేసుకోవడంతో.. సెక్యూరిటీ సిబ్బంది ముందు జాగ్రత్తగా ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన ఫ్యామిలీని ను బంకర్ లోకి తోలుకెళ్లారు. అనుకోని ఉపద్రవాలు తలెత్తితే ప్రెసిడెంట్ సేఫ్ గా ఉండేందుకు వైట్ హౌజ్ అండర్ గ్రౌండ్ లో బంకర్ ఏర్పాటు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, నిరసనలకు భయపడి ట్రంప్ బంకర్ లోకి వెళ్లడాన్ని చైనా ఎద్దేవా చేసింది. ‘‘హాంకాంగ్ సహా ప్రపంచం నలుమూలల్లో నిరసనల్ని గొప్పగా అభివర్ణిస్తూ, అందరికీ హక్కుల పాఠాలు చెప్పే అమెరికా.. సొంత దేశంలో నిరసల్ని మాత్రం ఎందుకు సహించడంలేదు?'' అంటూ చైనా మంత్రులు, మీడియా వ్యాఖ్యానాలు చేశారు.

  అసలేం జరిగిందంటే..

  అసలేం జరిగిందంటే..

  46 ఏళ్ల ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్.. మినియాపోలిస్ సిటీలో సెక్యూరిటీ గార్డు(బౌన్సర్)గా పనిచేసేవాడు. నార్త్ కరోలినాలో పుట్టిన ఆయన.. బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ క్రీడాకారుడిగా రాణించారు. పెళ్లైన తర్వాత హ్యూస్టన్ లో సెటిలయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. కొంతకాలంగా మినియాపోలిస్ లోనే ఉంటూ, వీలైనప్పుడల్లా హ్యూస్టన్ వెళ్లి ఫ్యామిలీని కలిసేవాడు. కరోనావైరస్ సంక్షోభం ఉద్యోగాలు కోల్పోయిన లక్షల మంది అమెరికన్లలో జార్జ్ ఒకరు. స్నేహితుల ద్వారా పని కోసం వెదుకుతోన్న ఆయన.. మే 25న స్థానికంగా ఉండే ‘కప్ ఫుడ్స్‌' స్టోర్ కు వెళ్లి సిగరెట్ ప్యాకెట్ కొన్నాడు. అయితే, అతనిచ్చిన 20డాలర్ల నోటు నకిలీదేమో అనే అనుమానంతో షాప్ కీపర్ పోలీసులకు ఫోన్ చేశాడు..

  8నిమిషాల 46 సెకన్లు..

  8నిమిషాల 46 సెకన్లు..

  నకిలీ నోటు చెలామణి చేసేందుకు ప్రయత్నించాడనే ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు.. జార్జ్ ను అరెస్టు చేసేక్రమంలో.. అతని పెడరెక్కలు వెనక్కి విరిచి, రోడ్డుపై బోర్లా పడేసిన పోలీసులు.. బాధితుడి మెడపై మోకాలితో గట్టిన ఒత్తిపట్టారు. మొత్తం 8 నిమిషాల 46 సెక్లపాట షావిన్ అనే పోలీస్ అధికారి జార్జ్ మెడపై మోకాలితో బలంగా అదిమాడు. ‘‘సార్.. ప్లీజ్.. నాకు ఊపిరాడట్లేదు.. వదిలేయండి..''అని ఎంత ప్రాధేయపడినా పోలీసులు వినించుకోలేదు. మొదటి ఆరు నిమిషాలకే అతని కదలికలు ఆగిపోయినా.. పోలీసులు మాత్రం మెడపై ఉంచిన మోకాలిని తీయలేదు. రోడ్డుపై వెళుతున్నవాళ్లు ఈ దృశ్యాలను వీడియో తీశారు. జార్జ్ అరెస్టులో పాల్గొన్న నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదైంది. అయితే నల్లజాతీయులపై తెల్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించడం ఇది కొత్తేమీకాదు.. ఈ దుష్టసంస్కృతికి చరమగీతంపాడాల్సిందేనంటూ జనం ఉద్యమబాటపట్టారు.

  English summary
  Tens of thousands of people protested across the United States and in major world cities for a sixth night as outrage over police brutality intensified over the death of George Floyd. China goads US and trump over George Floyd protests
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more