వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను అగ్నిగోళంలా మార్చేసిన జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టమ్ నివేదిక: షాకింగ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను అగ్నిగోళంలా మారడానికి కారణమైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన మరణానికి అసలు కారణం తేలింది. అమెరికా పోలీసులు చెబుతోన్న విషయాలన్నీ కట్టుకథలేనంటూ స్పష్టం చేసింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణం యాదృశ్చికంగా సంభవించలేదని పేర్కొంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే అతను మరణించినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదిక వెల్లడించింది.

సైన్యాన్ని దింపిన డొనాల్డ్ ట్రంప్: రాత్రికి రాత్రి మెరుపు నిర్ణయం: తీవ్ర హెచ్చరికలు జారీసైన్యాన్ని దింపిన డొనాల్డ్ ట్రంప్: రాత్రికి రాత్రి మెరుపు నిర్ణయం: తీవ్ర హెచ్చరికలు జారీ

 జార్జ్ ఫ్లాయిడ్ అటాప్సీ రిపోర్ట్..

జార్జ్ ఫ్లాయిడ్ అటాప్సీ రిపోర్ట్..

మిన్నెసొటాకు చెందిన ఓ ఇండిపెండెంట్ అటాప్సీ సంస్థ జార్జ్ ఫ్లాయిడ్ మృతదేహానికి పరీక్షలను నిర్వహించింది. అనంతరం తన అటాప్సీ రిపోర్ట్‌ను వెల్లడించింది. గొంతును నొక్కడం ద్వారా ఊపిరి ఆడకుండా చేయడం వల్లే జార్జ్ ఫ్లాయిడ్ మరణించినట్లు ఆ ప్రతినిధులు డాక్టర్ మైకెల్ బ్యాడెన్, డాక్టర్ అల్లెసియా విల్సన్ వెల్లడించారు. ఆస్ఫిక్షియా కారణం వల్ల జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయినట్లు నిర్ధారించారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు.

మోకాలితో అదిమి పట్టి

మోకాలితో అదిమి పట్టి

మిన్నియాపొలీస్ అధికారి డెరెక్..జార్జ్ ఫ్లాయిడ్‌ను రోడ్డు మీద పడేసిన మోకాలితో అదిమి పట్టి ఉంచినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్‌ను రోడ్డు మీద పడేసిన డెరెక్.. తన మోకాలుతో అతని గొంతును అదిమి పెట్టి కూర్చున్న ఫొటోలు అమెరికాలో నివసిస్తోన్న ఆఫ్రికన్ అమెరికన్లను ఆగ్రహానికి గురి చేశాయి. అతి క్రూరంగా అతణ్ని వల్ల ఊపిరి ఆడకుండా అతను మృతి చెందాడని ఆగ్రహిస్తున్నారు.

జాత్యహంకారానికి అద్దంపట్టేలా

జాత్యహంకారానికి అద్దంపట్టేలా

అమెరికన్ల జాత్యహంకారానికి ఇది నిదర్శనమని ఆరోపిస్తూ కొద్దిరోజులుగా ఆఫ్రికన్ అమెరికన్లు ఆందోళనలను చేస్తున్నారు. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలోని పలు నగరాలు అగ్నిగుండాలుగా తయారయ్యాయి. ఆ దేశంలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లందరూ ఏకం అయ్యారు. వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలతో అట్టుడికిస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

Recommended Video

Facebook Staff Angry With Mark Zuckerberg
 అమెరికాలో తగ్గని అల్లర్లు

అమెరికాలో తగ్గని అల్లర్లు

రాజధాని వాషింగ్టన్ డీసీ సహా అమెరికాలో ఎక్కడ కూడా అల్లర్లు తగ్గుముఖం పట్టట్లేదు. ఆ దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. చాలాచోట్ల ఆందోళనకారులు లూటీలకు దిగారు. సూపర్ మార్కెట్లను లూటీ చేశారు. వందలాది మంది గుంపులుగా తరలి వచ్చి ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వాషింగ్టన్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి. ఫలితంగా వాషింగ్టన్‌లో సైన్యాన్ని రంగంలోకి దింపింది ప్రభుత్వం.

English summary
George Floyd, who died after being choked by Minneapolis police officer Derek Chauvin last Monday, succumbed to asphyxiation as a result of Chauvin’s actions, an independent autopsy ordered by his family has confirmed. “Sustained pressure on the right side of Mr. Floyd's carotid artery impeded blood flow to the brain, and weight on his back impeded his ability to breathe,” an attorney for Floyd’s family said in a statement on Monday, after the autopsy report was released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X