వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జియా రీకౌంటింగ్‌లోనూ బైడెన్‌దే గెలుపు... ఈసారి ఎన్ని ఓట్ల తేడా అంటే...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరిగా సాగిన జార్జియా పోరులో రీకౌంటింగ్‌లోనూ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెనే విజయం సాధించారు. రీకౌంటింగ్‌లో ఆయనకు 12,284 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ విషయాన్ని జార్జియా ఎన్నికల అధికారి ప్రకటించారు. నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో జార్జియా కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 3 రోజుల పాటు సాగింది. కౌంటింగ్ ఆరంభంలో ఇక్కడ ట్రంప్ లీడ్‌లో ఉండగా... క్రమంగా విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతూ వచ్చింది. చివరకు దాదాపు 14వేల ఓట్లతో బైడెన్ విజయం సాధించారు.

Fact check : జో బైడెన్ ఆ హైదరాబాదీని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారా?Fact check : జో బైడెన్ ఆ హైదరాబాదీని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారా?

జార్జియాలో బైడెన్ గెలుపు 28 ఏళ్ల తర్వాత అక్కడ డెమోక్రాటిక్ పార్టీ జెండా ఎగిరేసేలా చేసింది. చివరిసారిగా 1992లో అప్పటి డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బిల్ క్లింటన్ ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత నుంచి వరుసగా రిపబ్లికన్లే ఇక్కడ గెలుస్తూ వచ్చారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్,ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు జరగ్గా... చివరకు ట్రంపే విజయం సాధించారు.

Georgia Recount Complete, Affirms Joe Biden Win: Officials

Recommended Video

Andhra Pradesh: అర్హులంద‌రికీ డిసెంబ‌ర్ 25న ఇళ్ల ప‌ట్టాల పంపిణీ... 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా...!!

తాజా ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసం 1శాతం కంటే తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్ నిర్వహించారు. ఈ ఫలితంతో బైడెన్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 306కి చేరింది. ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లతో రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అందుకోలేకపోయారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ ట్రంప్ ఇప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు. ట్రంప్‌కు ఒకవేళ వైట్ హౌస్‌ను వీడేందుకు మొండికేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది.జనవరి 20,2021న జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అంతకన్నా ముందు,డిసెంబర్ 14న ఎలక్టోరల్ కాలేజ్ సమావేశమై అధికారికంగా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రకటిస్తుంది. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు మొత్తం 79.5మిలియన్ ఓట్లు రాగా ట్రంప్‌కు 73.6మిలియన్ల ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే ఏ అధ్యక్ష అభ్యర్థికి రానన్ని ఓట్లను కైవసం చేసుకుని బైడెన్ పాత రికార్డులను బద్దలు కొట్టారు.

English summary
The US state of Georgia has completed a manual recount of all the ballots cast there in the presidential election, and the results confirm Joe Biden's win in the state, a local official announced Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X