వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిని రోడ్ల వెంట పరుగెత్తించిన చిన్ని ఉడుత: ఆ తర్వాత ఏం జరిగిందంటే... ఆసక్తికరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఉడతను అరెస్ట్ చేసిన పోలీసులు

బెర్లిన్: జర్మనీలో ఓ యువకుడిని ఉడుత పిల్ల రోడ్ల వెంట పరుగెత్తించింది. సాధారణంగా మనం నిజ జీవితంలో లేదా సినిమాల్లో సింహాలు, పులులు, కుక్కలు తరుముతుంటే పరుగెత్తిన వారిని చూస్తుంటాం. కానీ చిన్న ఉడుతపిల్ల ఓ వ్యక్తిని పరుగెత్తించింది. చివరకు అతనిని పోలీసులు కాపాడారు.

జర్మనీ కర్ల్‌స్రుహే నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఉడుత పిల్లను దాని తల్లి నుంచి వేరు చేశాడు. దీంతో ఉడుత పిల్ల అతని వైపు తిరిగింది. అతనిని తరిమింది. భయపడిన అతను నగరంలోని వీధుల వెంట పరుగెత్తాడు.

German Police Save Man Being Chased By Baby Squirrel

యువకుడు పరుగెత్తుతున్న విషయం తెలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వచ్చారు. అయితే, పోలీసులు రంగ ప్రవేశం చేసిన అనంతరం ఏమీ తెలియనట్లుగా ఆ ఉడుత పిల్ల నిద్రపోయింది. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి నిద్రించింది.

కాగా, ఆ ఉడుత పిల్లను దత్తత తీసుకున్న పోలీసులు దానికి కర్ల ఫ్రైడ్రిక్‌ అని పేరు పెట్టారు. అనంతరం బుల్లి ఉడుతను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాగా, చిన్ని ఉడుత కారణంగా వీధుల్లో తిరిగిన యువకుడు, పోలీసులు రంగ ప్రవేశం చేసే సమయానికి అది నిద్రించడం చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.

English summary
Brave cops in Germany came to the rescue of a man being chased down a street... by a baby squirrel. The incident took place on Thursday in the city of Karlsruhe, after police officers responded to a call by a panicked man saying he was being pursued by a squirrel. According to a police report of the incident, officers arrived at the scene in a patrol car to find that the unnamed man was indeed being chased by a squirrel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X