వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Angela Merkel: జర్మనీలో రాజకీయంగా ఓ శకం ముగిసినట్టే

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జర్మనీకి సుదీర్ఘకాలం పాటు ఛాన్సలర్‌గా వ్యవహరించిన ఏంజెలా మెర్కెల్ శకం దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. ఆదివారం నాటి ఎన్నికల్లో ఆమె సారథ్యాన్ని వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ప్రతిపక్ష పార్టీ స్వల్ప మెజారిటీని సాధించింది. 16 సంవత్సరాల తరువాత ఏంజెలా మెర్కెల్ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అధికార మార్పిడి చోటు చేసుకోవడానికే అధిక అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. తుది విడత ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జర్మనీలో ఆదివారం ఎన్నికలను నిర్వహించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటించారు అక్కడి ఎన్నికల కమిషన్ అధికారులు. ఏంజెలా మెర్కెల్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ 24.3 శాతం ఓట్లను సాధించింది. సోషల్ డెమొక్రటిక్ పార్టీకి 25.9 శాతం ఓట్లు పడ్డాయి. స్వల్ప మెజారిటీని నమోదు చేసుకుంది సోషల్ డెమొక్రటిక్ పార్టీ. మిగిలిన గ్రీన్ పార్టీ 14.5, లిబరల్ ఫ్రీ డెమొక్రటిక్ పార్టీ 11.5, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ-10.5, డై లింకె పార్టీ-5 శాతం మేర ఓట్లను అందుకున్నాయి. తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

 Germany Election Result: Angela Merkel’s conservative party narrowly Loses To Social Democrats

ప్రస్తుతం అధికారంలో ఉన్న క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్/క్రిస్టియన్ సోషల్ యూనియన్ (కన్జర్వేటివ్) పార్టీ కంటే సోషల్ డెమొక్రటిక్ పార్టీకి పోల్ అయిన ఓట్ల శాతం నామమాత్రంగా ఉంది. దీన్ని భర్తీ చేసుకోవడానికి ఏంజెలా మెర్కెల్.. ఇతర పార్టీలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు లేకపోలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలంటూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు ఒలాఫ్ ష్కోల్జ్ డిమాండ్ చేస్తోన్నారు.

తుది విడత ఫలితాలు వెలువడే సమయానికి తాము ఆధిక్యతలో నిలుస్తామని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్/క్రిస్టియన్ సోషల్ యూనియన్ (కన్జర్వేటివ్) పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలను కూడా కలుపుకొని ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికోసం 14.5 శాతం మేర ఓట్లు సాధించిన గ్రీన్ పార్టీ, 11.5 శాతం ఓట్లు పోల్ అయిన లిబరల్ ఫ్రీ డెమొక్రటిక్ పార్టీని కలుపుకొని కన్జర్వేటివ్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నట్లు జర్మనీ మీడియా వెల్లడించింది.

Recommended Video

German Elections 2021 : What Comes Next For Europe's Powerhouse? || Oneindia Telugu

కన్జర్వేటివ్స్‌కు మద్దతు ఇవ్వడానికి- పార్లమెంట్‌లో మూడో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన గ్రీన్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించాల్సి ఉంటుందనే షరతును ముందుకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీ తరఫున జర్మనీ ఛాన్సలర్ అభ్యర్థి ఒలాఫ్ ష్కోల్జ్ వాదన మరోలా ఉంటోంది. ఎన్నికల్లో తామను మెజారిటీ ప్రజలు ఎన్నుకొన్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఓటింగ్ ముగిసిన తరువాత ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు.

English summary
Germany's Social Democrats narrowly won national election. The Social Democrats (SPD) were on track for 26.0% of the vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X