వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనకెప్పుడు?: మూడు దేశాల్లో ఒకేరోజు కరోనా వ్యాక్సినేషన్ షురూ: సామాన్య ప్రజల కోసం

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని రూపుమాపడానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, కెనడా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్‌ను చేపట్టాయి. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఆరు లక్షలమందికి పైగా టీకా ఇచ్చారు. తాజాగా- మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరాయి. ఒకేరోజు.. తమ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుటాయి.. అక్కడి ప్రభుత్వాలు. భారత్‌లో ఇంకెప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

ఒకేసారి మూడు దేశాల్లో..

జర్మనీ, హంగేరి, స్లొవేకియాలల్లో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సాధారన ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావడానికి యూరోపియన్ యూనియన్ కమిషన్ ఆమోదం తెలిపిన మరుసటి రోజే.. ఒకేసారి మూడు దేశాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. యూరోపియన్ యూనియన్‌లోని సభ్య దేశాలన్నీ 10 వేల డోసుల ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు ఆర్డర్డు ఇచ్చాయి. అవి అందిన వెంటనే సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి.

హెల్త్‌కేర్ వర్కర్లకు..

హెల్త్‌కేర్ వర్కర్లకు..

బుడాపెస్ట్‌లోని సౌత్-పెస్ట్ ఆసుపత్రిలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హంగేరి మానవ వనరుల శాఖ మంత్రి మిక్లోస్ కస్లర్ తెలిపారు. తొలిదశలో హెల్త్‌కేర్ వర్కర్లకు వాటిని అందజేస్తున్నామని అన్నారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే స్లొవేకియా.. తన నిర్ణయాన్ని వెల్లడించింది. తమ దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. నిట్రాలోని ఫ్యాకల్టీ ఆసుపత్రిలోని పేషెంట్లకు వ్యాక్సిన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

యూరోపియన్ దేశాల్లో..

యూరోపియన్ దేశాల్లో..

అదే సమయంలో జర్మనీలోని అన్ని ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లల్లో వ్యాక్సినేషన్ ఆరంభమైంది. జర్మనీ సాక్సోనీ-అన్‌హాల్ట్ రీజియన్‌లోని ఆసుపత్రుల్లో తొలుత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లు అధ్యక్షురాలు ఉర్సులా వొన్‌డర్ లెయెన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనితో ఇక క్రమంగా అన్ని యూరప్ దేశాలు వ్యాక్సినేషన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫైజర్ సహా..

ఫైజర్ సహా..

ప్రస్తుతం ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమంగా సనోఫీ-గ్లాక్సోస్మిత్‌క్లైన్, ఆస్ట్రాజెనెకా, జన్‌సెన్ ఫార్మాసూటికా ఎన్‌వీ, క్యూర్ వ్యాక్, మోడెర్నాలకు అనుమతి ఇస్తామని ఉర్సులా తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 27 దేశాలకు సభ్యత్వం ఉంది. ఆయా దేశాల్లో 450 మిలియన్లకు పైగా జనాభా ఉన్నారు. దశలవారీగా వారందరికీ వ్యాక్సిన్ అందించడానికి అవసరమైన ప్రణాళికలను తాము రూపొందించుకున్నామని, దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని ఉర్సులా పేర్కొన్నారు.

English summary
Germany, Hungary and Slovakia began giving out their first coronavirus vaccine shots on Saturday only hours after receiving their first shipments, upsetting the European Union’s plans for a coordinated rollout Sunday across the bloc’s 27 nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X