వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుక్కా బార్లలో భారీగా కాల్పులు: విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు: సినీ ఫక్కీలో.. !

|
Google Oneindia TeluguNews

ఫ్రాంక్‌ఫర్ట్: జర్మనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హుక్కా బార్లపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మలేసియా విమానం గల్లంతు వెనుక కొత్త కోణం: పైలెట్ మాస్ కిల్లింగ్: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని..!మలేసియా విమానం గల్లంతు వెనుక కొత్త కోణం: పైలెట్ మాస్ కిల్లింగ్: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని..!

ధనికులు నివసించే ప్రాంతంలో..

జర్మనీలోని హనావు సిటీలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ దురాగతం చోటు చేసుకుంది. కర్ట్ షూమాకర్ ప్లాజ్‌‌లో చాలాకాలం నుంచి హుక్కా బార్లు నడుస్తున్నాయి. ధనికులు నివసించే ప్రాంతంలో ఉంటుందీ కర్ట్ షూమాకర్ ప్లాజ్. హుక్కా ప్రియులతో నిత్యం కిటకిటలాడుతుంటాయి అక్కడి బార్లు. రాత్రి కూడా అదే తరహా సందడి అక్కడ నెలకొంది. వచ్చీ పోయే వారితో కోలాహలంగా ఉన్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

కారులో వెళ్తూ.. సినీ ఫక్కీలో..

అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అయిదుమంది మరణించారు. అదే సమయంలో షూమాకర్ ప్లాజ్‌కు కొద్ది దూరంలో ఉన్న కెస్సెల్‌స్టాడ్ట్ ప్రాంతంలోని మరో హుక్కా బార్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. సినీ ఫక్కీలో కారులో వెళ్తూ తమ తుపాకులకు పని చెప్పారు. కెస్సెల్‌స్టాడ్ట్‌లోని బార్‌పై కాల్పులు జరిపారు ఆగంతకులు. ఈ ఘటనలో మరో ముగ్గురు మరణించారు.

మృతుల సంఖ్య మరింత..

ఈ రెండు ఉదంతాల్లో మొత్తం ఎనిమిది మరణించినట్లు జర్మనీ మీడియా వెల్లడించింది. అయిదు మంది మాత్రమే మృత్యువాత పడినట్లు హనావు పోలీసులు చెబుతున్నారు. పలువురు గాయపడగా.. వారిని హనావులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

హోర్తెతిన హనావు సిటీ..

హోర్తెతిన హనావు సిటీ..

ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు ఈ రెండు ప్రాంతాలను చుట్టుముట్టారు. తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రెండు హెలికాప్టర్లను వినియోగించారు. అంబులెన్సుల సైరన్ మోతలు, పోలీసు వాహనాల శబ్దాలతో మారుమోగిపోయింది హనావు సిటీ. ఓ రకమైన భీతావహ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై హనావు మేయర్ ఆరా తీశారు. నగర పోలీసు అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.

ఉద్దేశపూరక దాడిగా నిర్ధారణ..

ఉద్దేశపూరక దాడిగా నిర్ధారణ..

ఈ కాల్పుల వెనుక గల కారణాలేమిటనేది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు. ఉద్దేశపూరకంగా చేసిన దాడిగానే భావిస్తున్నామని హనావు సిటీ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల పనిగా అనుమానించడానికి గల అవకాశాలను కూడా తోసిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఒకరి కంటే ఎక్కువ మందే ఉండొచ్చని చెబుతున్నారు. కాల్పులకు పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

English summary
Eight people were killed in shootings in the German city of Hanau late Wednesday, authorities said. Two hookah lounges reportedly were targeted. Authorities were searching for the perpetrators early Thursday, three hours after the shootings at about 10 p.m. (2100 GMT), which police said also left five people wounded. Motive Not Clear Yet, Say CopsA heavy police presence was in place in central Hanau, with officers cordoning off the scene of one of the shootings as a helicopter hovered overhead. A car covered in thermal foil also could be scene, with shattered glass next to it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X