వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పేస్‌లో ఘోస్ట్ పార్టికల్స్.. లివింగ్ బెలూన్, ఏలియన్స్ ఉన్నారు!: పరిశోధకులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

డన్: అంతరిక్షంలో ఒక అరుదైన ఘోస్ట్ కణం కనుగొన్నామని పరిశోధకులు చెబుతున్నారు. అంతరిక్షంలో కనుగొన్న ఘోస్ట్ పరికరం నేపథ్యంలో ఎక్కడో ఒకచోట ఏలియన్స్ ఉండి ఉంటారని భావిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ బకింగ్‌హామ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోబయోలజీలు రీసెర్చ్ చేశాయి.

వారు చేసిన పరిశోధనల్లో మైక్రోస్కోపిక్ ఏలియన్ కణాలకు సంబంధించిన వాటిని గుర్తించారు. వాటిని లివింగ్ బెలూన్లుగా పేర్కొన్నారు. అవి మైక్రోస్కోపిక్ ఏలియన్ ఆర్గాన్‌లను ఒకచోటు నుండి మరొకచోటికి తీసుకు వెళ్తుండవచ్చునని చెబుతున్నారు. దీంతో, ఎక్కడో ఒకచోట ఏలియన్స్ ఉండి ఉంటారని భావిస్తున్నారు.

Ghost particle found in space hints at existence of aliens: Researchers

ఈ విషయమై పరిశోధకులు (రీసెర్చర్) మిల్టన్ వెయిన్‌రైట్ మాట్లాడుతూ.. సదరు లివింగ్ బెలూన్ కండువా అంత పొడవుతో, వెంట్రుక మందంతో ఉందని, దీనిని భూమికి 27 కిలోమీటర్ల దూరంలో స్ట్రాటో స్పియర్‌లో గుర్తించామని చెప్పారు.

అది ప్రకృతిలో జీవించి ఉందని, అది కార్బన్, ఆక్సిజన్ మూలాల సమ్మేళనం అన్నారు. ఈ లివింగ్ బెలూన్ గాలిలోని వాయువుల కంటే తేలికగా ఉందని, తద్వారా అది గాలిలో, స్పేస్ సముద్రంలో తేలియాడుతుందన్నారు. ఇది కూలిపోయిన బెలూన్‌లా కనిపిస్తోందన్నారు. అది దాని సహజత్వం కావొచ్చన్నారు. ఇలాంటిది భూమి పైన గతంలో ఎప్పుడు కనిపించలేదన్నారు.

English summary
A strange spectral-like 'ghost particle' discovered in debris gathered from outer space hints at possibility of alien life, say researchers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X