వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ అగ్నిపర్వతంతో అంతా సమాప్తం! నాగరికతనే తుడిచిపెట్టేసింది, బద్ధలైందా.. 10 కోట్ల మంది మటాష్!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

టోక్యో: ప్రళయాగ్ని ముంచుకొస్తోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిన ప్రమాదం.. ఇప్పుడు మళ్లీ ముంచుకొస్తోంది. అదేగనుక జరిగితే.. ఈ భూమ్మీద 10 కోట్ల మంది మరణిస్తారు. ఈ విషయమే ఇప్పుడు శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

అవును, సముద్రపు అడుగుభాగాన కొన్ని వేల ఏళ్లపాటు నిద్రాణంతో ఉన్న ఓ అగ్నిపర్వతం ఇప్పుడు క్రియాశీలమైంది. అది ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు. ఒకవేళ పేలిపోతే అందులోంచి వచ్చే లావాకు బలికాకుండా ఆపడం ఎవరితరమూ కాదు!

క్రియాశీలమైన అగ్నిపర్వతం...

క్రియాశీలమైన అగ్నిపర్వతం...

జపాన్ దక్షిణ ప్రాంతంలో సముద్రం అడుగుభాగాన ఓ భయంకరమైన అగ్నిపర్వతం ఉంది. దీనిపేరు ‘కికాయి కాల్‌డేరా'. ఈ అగ్నిపర్వతం కొద్ది భాగమే భూమ్మీదికి కనిపిస్తుంది. కానీ దీని అడుగుభాగం మాత్రం భారీ సైజులో ఉంటుంది. సుమారు 10 కిలోమీటర్ల వెడల్పు ఉండొచ్చు. దీని ఎత్తే అర కిలోమీటరుకుపైగా ఉంటుంది. చరిత్రకారుల కథనం ప్రకారం.. ఇది 7,300 సంవత్సరాల కిందట ఒకసారి బద్దలై లావాను ఎగజిమ్మింది. ఈ ప్రళయాగ్ని దెబ్బకు అక్కడి ‘జొమోన్ నాగరికత' పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

వచ్చే ఏడాదే ప్రళయం.. భూమిపై మనుష్య జాతి అంతం!? నోస్ట్రడామస్‌ జోస్యం నిజమవుతుందా?వచ్చే ఏడాదే ప్రళయం.. భూమిపై మనుష్య జాతి అంతం!? నోస్ట్రడామస్‌ జోస్యం నిజమవుతుందా?

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు...

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు...

ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఈ కికాయి కాల్‌డేరా అగ్నిపర్వతం క్రియాశీలమైనట్లు జపాన్‌లోని కోబె విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు ఇటీవల ఈ అగ్నిపర్వత ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. తమ పరిశోధనలో భాగంగా ఫుకేమరూ అనే నౌక సాయంతో అగ్నిపర్వత ప్రాంతానికి వెళ్లిన వీరు అక్కడి సముద్ర అడుగుభాగాన ఓ భారీ లావా గోపురాన్ని గుర్తించారు. వేల ఏళ్లుగా పేరుకుపోయిన లావాతో ఏర్పడింది ఈ గోపురం. దీని పరిమాణం 32 ఘనపు కిలోమీటర్లు. అంటే.. 32 సంఖ్య పక్కన ఓ 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యలో ఉన్నన్ని లీటర్ల లావా ఇందులో ఉంటుందన్నమాట. పైగా ఏళ్లు గడిచేకొద్దీ ఈ గోపురం పరిమాణం కూడా పెరుగుతూ వస్తోంది.

ఇప్పుడు ఏ స్థితిలో ఉందంటే...

ఇప్పుడు ఏ స్థితిలో ఉందంటే...

ఈ కికాయి కాల్‌డేరా అగ్నిపర్వతాన్ని ఆషామాషీగా తీసుకునే వీలులేదు. ఎందుకంటే ఇదొక అత్యంత భారీ అగ్నిపర్వతమేకాక ఎన్నో వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్నటువంటిది. గతంలో ఇది బద్దలైనప్పుడు ఎగసిన లావా అగ్నిపర్వతంపై పడి గడ్డకట్టడంతో పైకి తెలియడం లేదుగానీ.. లోలోపల మాత్రం లావా తీవ్రమైన ఒత్తిడితో ఉడుకుతోంది. ఈ అగ్నిపర్వతంలోపల కనీవినీ ఎరుగని మొత్తంలో లావా ఉన్నదనడానికి ఆనవాళ్లుగా శాస్త్రవేత్తలకు ‘రయోలైట్స్' అనే రాళ్లు కూడా లభించాయి.

బద్దలైతే ఏం జరుగుతుంది?

బద్దలైతే ఏం జరుగుతుంది?

ఒకవేళ ఈ అగ్నపర్వతం బద్దలై లావా ఎగజిమ్మితే కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు సల్ఫర్ డయాక్సైడ్‌తో కూడిన బూడిద వెదజల్లబడుతుంది. ఫలితంగా దట్టమైన ధూళి మేఘాలు ఏర్పడతాయి. దీనివల్ల సూర్యుడి నుంచి వస్తున్న వెలుతురు కూడా కొంతకాలంపాటు భూమ్మీదికి ప్రసరించదు. ఫలితంగా భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ఇది సముద్రం అడుగు భాగాన ఉంది కాబట్టి ఇది బద్దలైన సమయంలో సునామీ సంభవించి అమెరికా తీరాన్ని తాకుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కికాయి అగ్నిపర్వతాన్ని మరింత అధ్యయనం చేయడం ద్వారా ఇది బద్దలయ్యే సమయాన్ని అంచనా వేసేందుకు జపాన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

కచ్చితమేనా? గ్యారెంటీ ఏమిటి?

కచ్చితమేనా? గ్యారెంటీ ఏమిటి?

కికాయి కాల్‌డేరా అగ్నిపర్వతం కచ్చితంగా బద్దలవుతుందని గ్యారెంటీ ఏమిటి? ఈ ప్రశ్నకూ శాస్తవేత్తల దగ్గర సమాధానముంది. వారి అంచనాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ఇండోనేషియా నుంచి మొదలుకొని ఫిలిప్పీన్స్, జపాన్, అమెరికా ఉత్తర, దక్షిణ పశ్చిమ తీర ప్రాంతమంతటినీ కలిపి ‘రింగ్ ఆఫ్ ఫైర్'గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతం కావడంతో దీనికి ఈ పేరు పెట్టారు. ఇప్పుడు ఇదే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయి. అంతేకాదు, ఈ ప్రాంతంలో వరుసగా భూకంపాలు కూడా సంభవిస్తున్నాయి. భూమి పొరల కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలత కారణంగానే ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. అంతేకాదు,

English summary
One of the world’s largest lava domes has been discovered in an underwater volcano south of Japan, suggesting an enormous build-up of magma may exist underneath it. The structure, which appears to be growing in size, was formed following the Akahoya supereruption that took place at the site 7300 years ago, leaving a 12-mile hollow called Kikai Caldera. That eruption is thought to have wiped out the ancient Jomon culture that inhabited the southern Japanese island of Kyushu at the time.Supereruptions are rare but devastating events that can have global impacts due to volcanic ash and chemicals obscuring the Sun and triggering a “volcanic winter”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X