వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవంతుడా.. ఇదే వ్యాధి? ముందు తలనొప్పి.. ఆ తరువాత రక్త కన్నీరు!

ఓ చిన్నారికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తోంది. అలా వచ్చినప్పుడల్లా... కళ్ల నుంచో, ముక్కు నుంచో, చెవుల నుంచో, చేతుల చర్మం నుంచో రక్తం ధారలుగా కారడం మొదలవుతుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: ఏడేళ్ల వయసులో ఓ చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో చూడండి. అప్పుడప్పుడు తలనొప్పి వస్తోంది. అలా వచ్చినప్పుడల్లా... కళ్ల నుంచో, ముక్కు నుంచో, చెవుల నుంచో, చేతుల చర్మం నుంచో రక్తం ధారలుగా కారడం మొదలవుతుంది. చూస్తే ఎక్కడా ఏ గాయం కానరాదు. కాసేపటి తరువాత అదే ఆగిపోతుంది. ఒకటి, రెండ్రోజులు కాదు.. ఆర్నెల్లుగా ఇదే బాధ.

థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాపకు ఎదురైన చిత్రమైన సమస్య ఇది. స్థానికంగా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆమె జబ్బు నయం కావడం లేదు. ఈ పరిస్థితి నుంచి తమ పాపను కాపాడాలని ఆమె తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ప్రపంచంలో ఇంతకుముందు కూడా ఇలాంటి మూడు, నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో ఏదో ఒక భాగంలో రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారుతుంది. దీన్ని 'హెమటోహైడ్రాసిస్‌' అని వైద్య నిపుణులు పిలుస్తున్నారు.

Girl, 7, 'sweats' blood from her eyes, nose, ears and skin every time she gets a headache

ఈ జబ్బు కోటి మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి తన కూతురు ధైర్యవంతురాలని, శరీర భాగాల నుంచి రక్తం కారుతున్నా ఇప్పటికీ ఆమె ధైర్యం సడలలేదని, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందని ఆ పాప తల్లి నిపాపర్న్‌ కాంటేన్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు మూడు, నాలుగు వైద్యుల దృష్టికి వచ్చినా వారు ఇప్పటి వరకు ఈ జబ్బుకు మందు కనుక్కోలేక పోయారు. కనీసం ఎందుకు వస్తుందో కూడా కారణం తెలుసుకోలేకపోయారు. అయితే మానసిక ఒత్తిడి తగ్గించే 'బేటా బ్లాకర్స్‌' మందుల వల్ల ఉపశమనం లభించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

English summary
A young girl bleeds from her eyes, nose, ears and skin every time she gets a headache. Phakamad Sangchai , 7, from Nongkghai, Thailand, started profusely bleeding almost six months ago. Despite receiving treatment at a local hospital, Phakamad continues to suffer from the baffling condition, leaving her family desperate for help.Phakamed said: 'I don't want to be famous, but I just want someone to help me with this mystery illness. It is really spoiling my life and I am so concerned that it will get worse.'She is thought to have hematohidrosis, which is an extremely rare condition that causes sufferers to 'sweat' blood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X