• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అది పాపిస్థానే: ప్రేమించిన యువకుడి చెల్లెల్ని నగ్నంగా ఊరేగించారు

|

ఇస్లామాబాద్: పాకిస్థాన్ అంటేనే దురాగతాలకు మారుపేరుగా నిలుస్తోంది. అక్కడ ఎన్నోదారుణాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా, మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని ప్రేమించాడని, ఆ యువకుడి సోదరికి దారుణమైన శిక్షను విధించారు పంచాయతీ పెద్దలు.

అక్టోబర్ 27న జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన సజ్దద్‌ అనే వ్యక్తి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Girl paraded naked for brother's 'sin' in Pakistan

ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పంచాయతీ దృష్టికి తీసుకెళ్లారు. విచారించిన గ్రామపెద్దలు సజ్జద్‌కు 1,05,000 జరిమానా విధించారు. అంతటితో ఆగని ఆ మూర్ఖలు.. సజ్జద్‌ సోదరికి దారుణమైన శిక్ష విధించారు.

అమ్మాయి అని కూడా చూడకుండా ఆమెను గ్రామమంతా నగ్నంగా ఊరేగించారు. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశామని.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

English summary
In a horrific incident, a teenage girl was forcibly stripped and paraded naked for an hour in Pakistan's Khyber-Pakhtunkhwa province as "punishment" -- because her brother had been in a relationship with a girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X