వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురిపై నెలలుగా తండ్రి, అంకుల్స్ అత్యాచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Girl raped many times by her father
యూఏఈ: యూఏఈలో 14 ఏళ్ల బాలికను ఆమె తండ్రి చాలా రోజులుగా పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆయనతో పాటు ఇద్దరు అంకుల్స్ కూడా ఆమె పైన ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అయితే, కొద్ది రోజుల తర్వాత ఆమె ఇంటి నుండి తప్పించుకొని వచ్చింది.

ఇంటి నుండి తప్పించుకొని వచ్చిన ఆ బాలిక హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌ను ఆశ్రయించింది. వారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం స్థానికంగా ఉన్న ఓ పత్రికలో వచ్చింది. వారు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు తండ్రి, ఆ ఇద్దరు అంకుల్స్‌ను అరెస్టు చేశారు.

నిందితుల్లో తండ్రితో పాటు తండ్రి సోదరుడు, అతని భార్య సోదరుడు కూడా ఉన్నారు. ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన వారు ఆమెను ఇంటిలోనే బందించారు. చాలా రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించడంతో ఎవరికి ఈ విషయం చెప్పే అవకాశం రాలేదు.

అయితే, ఇటీవల ఆమె తప్పించుకొని హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించింది. వారికి తన బాధలు చెప్పుకుంది. తన తండ్రి, ఇద్దరు అంకుల్స్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ ఘాతుకాన్ని తల్లి కూడా అడ్డుకోలేదని చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో వారు, ముగ్గురిని అరెస్టు చేశారు.

English summary
Girl raped many times by her father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X