వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 కోట్లను దాటిన కరోనా కేసులు: 22 లక్షలకు చేరువగా మరణాలు: తల్లడిల్లుతోన్న అగ్రరాజ్యం

|
Google Oneindia TeluguNews

అమెరికా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తూనే ఉంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 22 లక్షలకు చేరువ అవుతున్నాయి. మరణాల సంఖ్య గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు, మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ మరింత గుబులు పుట్టిస్తోంది.

పంచాయతీల్లో వైసీపీ జైత్రయాత్ర ప్రారంభమైందా?: అప్పుడే ఏకగ్రీవం: తూర్పు గోదావరి జిల్లాతోపంచాయతీల్లో వైసీపీ జైత్రయాత్ర ప్రారంభమైందా?: అప్పుడే ఏకగ్రీవం: తూర్పు గోదావరి జిల్లాతో

భారత్ సహా అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. అయినప్పటికీ- కరోనా తీవ్రత ఎప్పట్లాగే కొనసాగుతోంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 21,69,316 మంది మరణించారు. రోజూ వేల సంఖ్యల్లోనే మరణాలు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో మరణాల సంఖ్య భయానకంగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 10 కోట్లను దాటేసింది. ఇప్పటిదాకా 10,09,04,378 కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో ఇప్పటిదాకా 4,35,452 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 2,60,11,222కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

Global COVID-19 cases exceed 10 Crores despises Vaccinations in many countries

బ్రెజిల్‌లో ఇప్పటిదాకా 2,18,918 మంది చనిపోయారు. 89,36,590 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి మెక్సికోలో ఇప్పటిదాకా 1,52,016 మంది మరణించారు. 17,88,905 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భారత్ తరువాత ఆ స్థాయిలో కరోనా మరణాలు అత్యధికంగా నమోదైన దేశం ఇదే. కరోనా మరణాల రేటు అత్యధికంగా ఉన్న దేశం కూడా ఇదే. అమెరికా, భారత్, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో అత్యధిక కేసులు రష్యాలో నమోదు అయ్యాయి. బ్రిటన్, ఫ్రాన్స్‌లల్లో 30 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.

భారత్‌లో కొత్తగా 12,689 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 137 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 1,06,89,527కు చేరుకున్నాయి. ఇందులో 1,03,59,305 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షన్నరను దాటింది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,53,724 మంది మృతి చెందారు. 24 గంటల్లో కొత్తగా 13,320 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,76,498గా నమోదు అయ్యాయి. ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా 20,29,480 వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Recommended Video

AP Panchayat Elections Candidates Eligibility పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి?.. అర్హులు, అనర్హులు ఎవరు?.

English summary
More than 10 Crore Coronavirus positive cases have now been recorded worldwide. Seven of the 10 countries most affected by the virus are in Europe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X