వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు రెండు లక్షల మందికి పైగా బలి: ఒక్క అమెరికాలోనే: 30 లక్షలకు చేరువలో బాధితులు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో జన్మించిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది మందిని ఆసుపత్రులు, ఐసొలేషన్ కేంద్రాలపాలు చేసింది. నాలుగు నెలల వ్యవధిలో రెండు లక్షల మందిని బలి తీసుకుంది. కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 2,03,289 మంది మరణించారు. 29 లక్షల మంది దీని బారిన పడ్డారు. వారంతా కోలుకుంటారో.. లేదో తెలియదు. ఎంతమంది ప్రాణాలతో మిగులుతారో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. 29,21,201 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అమెరికాను అల్లకల్లోలానికి గురి చేస్తోంది. అమెరికాలో ఈ వైరస్ బారిన పడని రాష్ట్రమంటూ ఏదీ లేదు. అగ్రరాజ్యాన్ని పూర్తిగా కమ్మేసింది. అమెరికాలో ఇప్పటిదాకా 54,265 మంది మరణించారు. 9,60,896 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రత్యేకించి- అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ను కకావికలం చేసిందీ కరోనా. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 21 వేల మందికి పైగా మరణించారంటే. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్‌లో 21,908 మంది మరణించగా, 2,88,313 మంది దీని బారిన పడ్డారు. న్యూజెర్సీలో 5863, మస్సాచుసెట్స్‌లో 2730, మిచిగాన్‌లో 3274 మంది చనిపోయారు.

Global Covid-19 Death Count Crosses 2 Lakhs

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రష్యాలో శరవేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో గరిష్ఠంగా 5966 కేసులు ఈ ఒక్క దేశంలోనే నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు రష్యాలు ఇప్పటిదాకా నమోదు కాలేదు. బ్రిటన్‌లో 4913, స్పెయిన్‌లో 3995 పాజిటివ్ కేసులు 24 గంటల వ్యవధిలో రికార్డు అయయయాయి. అమెరికా తరువాత స్పెయిన్‌, ఇటలీల్లో అత్యధిక మరణాలు నమోదు అయ్యాయి.

ఇటలీలో 26,384, స్పెయిన్-22,902 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌లో 22,614 మంది, బ్రిటన్‌లో 20,319 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటోన్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో అంచనాలకు మించిన స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటిదాకా 8,36,969 మంది కోలుకున్నారు. కోలుకున్న వారిలో చివరి రెండు లక్షల సంఖ్య అతి తక్కువ కాలంలో నమోదు కావడం పట్ల ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Recommended Video

Watch Flights Parking at Delhi's Airport, Rare Video Must Watch

English summary
The entire world is still in the clutches of deadly coronavirus pandemic. On Saturday, the global death toll reached the 2-lakh mark. USA continues to be the epicentre of coronavirus pandemic. There have been 29,21,201 coronavirus infections across the world so far. On a brighter note 8,16,688 coronavirus patients have made a successful recovery from Coronavirus infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X