వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్ ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్, కారణాలివే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Global Internet Shutdown Likely Over Next 48 Hours 48 గంటల్లో ఇంటర్నెట్ షట్ డౌన్..! | Oneindia

న్యూఢిల్లీ: రానున్న 48 గంటలలో ఇంటర్నెట్ యూజర్లు నెట్ వర్క్ వైఫల్యం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సర్వర్ మెయింటెనెన్స్ సందర్భంగా ఇంటర్నెట్ వినియోగదారులు నెట్ వర్క్ సమస్య ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రష్యా టుడే రిపోర్ట్ మేరకు గ్లోబల్ ఇంటర్నెట్ యూజర్లు పలుచోట్ల నెట్ వర్క్ వైఫల్యం ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యమైన డొమైన్ సర్వర్లు, దానికి సంబంధించిన నెట్ వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ కూడా కాసేపు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రష్యా టుడే రిపోర్ట్

రష్యా టుడే రిపోర్ట్

రష్యా టుడే రిపోర్ట్ మేరకు గ్లోబల్ ఇంటర్నెట్ యూజర్లు పలుచోట్ల నెట్ వర్క్ వైఫల్యం ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యమైన డొమైన్ సర్వర్లు, దానికి సంబంధించిన నెట్ వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ కూడా కాసేపు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సైబర్ అటాక్స్‌కు కౌంటర్‌గా

సైబర్ అటాక్స్‌కు కౌంటర్‌గా

ఇంటర్నెట్ కార్పోరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ (ఐసీఏఎన్ఎన్) మెయింటెనైన్ వర్క్ చేయనుంది. ఇంటర్నెట్ అడ్రస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) రక్షణ కోసం క్రిఫ్టోగ్రాఫిక్ కీలో మార్పులు చేయనున్నారు. ఇటీవల సైబర్ అటాక్స్ జరుగుతోన్న విషయం తెలిసిందే. పెరుగుతోన్న సైబర్ అటాక్స్ నుంచి నుంచి కాపాడేందుకు ఈ మార్పులు అవసరమని ఐసీఏఎన్ఎన్ తెలిపింది.

అందుకే అప్రమత్తం చేస్తున్నాం

అందుకే అప్రమత్తం చేస్తున్నాం

సురక్షితమైన భరోసా కోసం, స్థిరత్వం కోసం గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్ తప్పనిసరి అని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మార్పులపై నెట్ వర్క్ ఆపరేటర్లను, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను అప్రమత్తం చేయకుంటే పలు ఇంటర్నెట్ యూజర్లపై ప్రభావితమయ్యే అవకాశముందని చెప్పారు.

 రానున్న 48 గంటల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు

రానున్న 48 గంటల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు

తగిన సిస్టమ్ సెక్యూరిటీలను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని (సైబర్ అటాక్స్) తగ్గించవచ్చునని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) వెల్లడించింది. ఈ కారణంగా ఇంటర్నెట్ వినియోగదారులు లేదా ట్రాన్సాక్షన్స్‌లలో రానున్న 48 గంటలు ఏవైనా ఇంటర్నెట్ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చునని తెలిపారు. అంతేకాదు, యూజర్లు కాలం చెల్లిన ఐఎస్‌పీలను వినియోగించేవారు గ్లోబల్ నెట్ వర్క్ యాక్సెస్ అనుసంధానంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చునని తెలిపింది.

English summary
Internet users across the globe may experience widespread network failures as the key domain servers are slated to undergo routine maintenance over the next 48 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X