వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇకపై జీమెయిల్‌లో యాహూ సేవలు: గూగుల్ వెల్లడి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అత్యుత్తమ మెయిల్ సర్వీసుల్లో అగ్రగామిగా ఉన్న జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌ను జత చేర్చారు. ఇకపై యాహూ.. అవుట్‌లుక్‌.. హాట్‌మెయి‌ల్‌ను కూడా జీమెయిల్‌లో ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది.


సందేహాలు: 'ఫ్రీడమ్ 251' ఒక స్మార్ట్‌ఫోన్ కుంభకోణమా?


ఈ ఫీచర్‌కు పెట్టిన పేరు జీమెయిల్‌ఫై. ‘జీమెయిల్‌ఫై' ఫీచర్ కోసం ముందుగా జీమెయిల్‌లోకి ఈమెయిల్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత ‘జీమెయిల్‌ఫై' ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయాలి. తద్వారా మీ జీమెయిల్‌లో యాహూ, అవుట్ లుక్, హాట్‌మెయి‌ల్‌ పని చేయడం మొదలవుతుంది.

Gmailify: The best of Gmail, without an gmail address

యాహూ, అవుట్‌లుక్‌, హాట్‌మెయిల్‌ మెయిళ్లకూ స్పామ్‌ ప్రొటెక్షన్‌ పని చేస్తుంది. దీంతో పాటు జీమెయిల్‌ లాగే ఇన్‌బాక్స్‌ టూల్స్‌ పనిచేస్తాయని జీమెయిల్‌ తన అధికారిక బ్లాగులో వెల్లడించింది. అంతేకాదు ఈ ఫీచర్‌ను వద్దనుకుంటే కొన్ని మెయిల్ ఐడీలను జీమెయిల్‌ఫై నుంచి తొలగించే వీలును కూడా కల్పించింది.

ప్రస్తుతం యాహూ, హాట్‌మెయిల్‌, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ ఈమెయిళ్లకు మాత్రమే జీమెయిల్‌ఫై పనిచేస్తుందని.. త్వరలో మరిన్ని అందుబాటులోకి రానున్నట్లు గూగుల్‌ తెలిపింది.

English summary
Gmailify links your existing account to Gmail so that you get all the bells and whistles—spam protection, inbox organization and even Google Now cards based on your mail—without having to leave your current address behind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X