వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన గోఎయిర్ విమానం...

|
Google Oneindia TeluguNews

గోఎయిర్‌కి చెందిన రియాధ్-ఢిల్లీ విమానం మంగళవారం అత్యవసర పరిస్థితుల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో ఓ వ్యక్తికి(30) హఠాత్తుగా గుండెపోటు రావడంతో విమానాన్ని పైలట్ కరాచీలోని జిన్నా విమానాశ్రయం వైపు మళ్లించాడు. అక్కడి విమానాశ్రయంలో గోఎయిర్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అయితే గుండెపోటుకి గురైన వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది.

దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రియాధ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన గోఎయిర్ G8-6658A విమానం మెడికల్ ఎమర్జెన్సీతో కరాచీలో ల్యాండ్ అయినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు తెలిపింది.

GoAir flight from Riyadh to Delhi makes emergency landing in Karachi

Recommended Video

భారత్ లో చొరబాటుకు పాక్ యత్నం..పాక్ డ్రోన్ ను ధ్వంసం చేసిన భారత ఆర్మీ!! | Oneindia Telugu

గతంలోనూ విమానాలు ఇలా అత్యవసరంగా ల్యాండ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానం జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం తలుపు తెరుచుకున్నట్లు గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరాడు. ల్యాండ్ అయిన విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం విమానం తిరిగి పాక్ పయనమైంది.

English summary
A GoAir Riyadh-Delhi flight diverted to the Karachi airport on Tuesday after a medical emergency was reported onboard, according to news agency ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X