• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: గాడ్జిల్లా అనుకొని గజ్జున వణికారు -సూపర్‌ మార్కెట్‌లో భారీ బల్లి కలకలం

|

నిజంగా భూమ్మీద అలాంటి జీవులు ఏనాడూ లేకున్నా, జపాన్ రచయితల మస్తిష్కం నుంచి పుట్టుకొచ్చిన రాక్షస బల్లికి రూపమే గాడ్జిల్లా. ఆ పేరుతో నడుస్తోన్న ఫ్రాంచైజ్ లో 36వ సినిమాగా రెండు వారాల కిందటే జనం ముందుకొచ్చింది 'గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్'. కరోనా విలయ కాలంలోనూ అమెరికాతోపాటు ఆసియా వ్యాప్తంగానూ మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా సౌత్ ఏషియాలోనైతే చిన్నపాటి మేనియా క్రియేట్ చేసింది. అప్పటికే గాడ్జిల్లా పోరాటాలను వెండితెరపై చూసిన జనానికి సడెన్ గా కళ్లముందు అది ప్రత్యక్షమైతే!!

మరో ట్విస్ట్: సెలవులో జస్టిస్ రమణ -సుప్రీంకోర్టు కొలీజియం భేటీపై నీలినీడలు -సీజేఐ బోబ్డే తదుపరి స్టెప్?మరో ట్విస్ట్: సెలవులో జస్టిస్ రమణ -సుప్రీంకోర్టు కొలీజియం భేటీపై నీలినీడలు -సీజేఐ బోబ్డే తదుపరి స్టెప్?

 కేకలు, పరుగులు..

కేకలు, పరుగులు..

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్ సిటీలోనూ సరిగ్గా ఇలాంటి సీనే చోటుచేసుకుంది. ఓ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తోన్న జనలు.. అందులోకి చొరబడిన భారీ బల్లిని చూసి గాడ్జిల్లా అనుకుని గజ్జున వణికిపోయారు. దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న ఆ జీవిని చూసి హాహాకారాలు, ఉరుకులు, పరుగులు తప్పలేదు. ఎలా చూసినా భయం పుట్టించే ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ సినిమా అయితే, గాడ్జిల్లా వర్సెస్ అల్మారాలు రియల్ సీన్ అంటూ జనం సరదా రాతలు రాసుకున్నారు.

చల్లదనం కోసం దూరిందట..

చల్లదనం కోసం దూరిందట..

మానిటర్ లిజర్డ్‌ అని పిలిచే ఇలాంటి భారీ బల్లులు థాయిలాండ్ లో అప్పుడప్పుడూ జనం మధ్య దర్శనమిస్తూనే ఉన్నాయట. అయితే, అవి సూపర్ మార్కెట్లోకి ప్రవేశించడం మాత్రం చాలా అరుదట. చనిపోయిన జంతువుల చర్మాన్ని తిని బతికేస్తుంటాయీ భారీ జీవాలు. భారత్ కు సమీపంగా ఉండే థాయిలాండ్ లోనూ ప్రస్తుతం ఎండాకాలం కావడం, ఉక్కపోత భరించలేక చల్లదనం కోసమే బల్లిగారు షాపింగ్ మాల్ లోకి దూరి ఉంటారని తెలుస్తోంది. కాగా,

భారీ బల్లులతో ప్రమాదం లేదు..

భారీ బల్లులతో ప్రమాదం లేదు..

సూపర్ మార్కెట్లో కాసేపు కలకలం తర్వాత ఆ రాకాసి బల్లిని అటవీ శాఖ అధికారులు బందించి, తిరిగి అడవుల్లో వదిలిపెట్టారు. జీవశాస్త్ర నిపుణుల వివరణ ప్రకారం వాటి భారీ ఆకారం వల్ల బల్లులు భయంకరంగా కనిపిస్తాయి కానీ అవి మనుషులకు ఎలాంటి హానీ తలపెట్టవు. మొత్తంగా గాడ్జిల్లా సినిమా సమయంలో ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంది.

అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!

English summary
A video that is going viral shows a giant monitor lizard scaling the shelves and knocking down products at a supermarket in Thailand. The terrifying scene was filmed at a 7 Eleven store in Thailand capital Bangkok and later shared online by Thai travel agency Mundo Nomada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X