వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాడ్జిల్లాను తలపించింది: మైదానంలో మొసలిని చూసి బెంబేలెత్తిపోయారు..

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: గాడ్జిల్లాను తలపించే రాకాసి బల్లి జాతికి చెందిన మొసలి ఒకటి ఫ్లోరిడాలోని గోల్ఫ్‌ కోర్టులో ప్రత్యక్షమైంది. ఈ దెబ్బకు అటువైపు వెళ్లాలంటేనే క్రీడాకారులు జంకుతున్నారు. చూడటానికే భయానకంగా ఉన్న ఆ మొసలికి 'చబ్స్' అని పేరు కూడా పెట్టారు.

ఇక్కడి పోప్‌ గోల్ఫ్‌ మైదానంలో ఇటీవల బఫెల్లో క్రీక్‌ గోల్ఫ్‌ కోర్స్‌ పోటీలు జరిగాయి. ఇదే క్రమంలో ఫిబ్రవరి 14న గేమ్ జరగాల్సి ఉంది. అయితే ఆరోజు ఆటకు ముందు ఒక భారీ మొసలి మైదానంలోకి రావడం అందరిని బెంబేలెత్తించింది.

Godzilla-Sized Alligator Strolls Through Florida Golf Course

మైదానికి ఆనుకుని ఉన్న ఓ నీటి కొలను నుంచి ఈ మొసలి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. సుమారు 25ఏళ్ల క్రితం ఇక్కడ మొసలి కనిపించిందని, ఇప్పుడు కనిపించింది కూడా అదే అయి ఉంటుందని అక్కడివారు అనుమానిస్తున్నారు.

2016లో ఇదే మొసలి ఒకసారి కనిపించిందని.. అప్పుడు దానికి 'చబ్స్' అని పేరు పెట్టినట్టు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇప్పటిదాకా ఇది ఎవరి మీద దాడి చేయలేదని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

English summary
A giant, almost Godzilla-sized alligator was out and about on a golf course like it's no big deal... because, Florida. A video shared on Facebook by Pope Golf shows the gator casually strolling across the lush green grass.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X