రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన గూగుల్... అక్కడ రాజకీయ ప్రకటనలపై తాత్కాలిక నిషేధం .. రీజన్ ఇదే !!
రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చే మంచి నిర్ణయం తీసుకుంది గూగుల్. జనవరి 14వ తేదీ నుండి జనవరి 21వ తేదీ వరకు రాజకీయ ప్రకటనలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన నేపథ్యంలో గూగుల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 21వ తేదీ తర్వాత పరిస్థితులను బట్టి మరోమారు ప్రకటన చేయనుంది గూగుల్ సంస్థ.
ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్ .. మ్యాప్ ను అనుసరించి డ్యామ్ లో పడిపోయిన కారు , ఒకరు మృతి

యూఎస్ లో రాజకీయ ప్రతనలపై తాత్కాలిక నిషేధం విధించిన గూగుల్
గూగుల్ సంస్థ తాను తీసుకున్న నిర్ణయాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి, దానిపై తిరిగి అంచనా వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది . దీనిని బట్టి ప్రస్తుతం విధించిన తాత్కాలిక నిషేధం ఇంకా ఎక్కువ కాలం కొనసాగవచ్చని అంచనా. యూఎస్ రాజకీయాలు, యూఎస్ క్యాపిటల్ వద్ద తిరుగుబాటు, అభిశంసన, ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించే ప్రకటనలను అన్నింటిని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్ సంస్థ వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం
ఇక గూగుల్ విధించిన ఈ నిషేధంలో వార్తా సంస్థలు, వ్యాపారులు నిర్వహించే రాజకీయ ప్రకటనలు సైతం ఉన్నాయని పేర్కొంది.
ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత మళ్ళీ ప్రకటనలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది . అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఈనెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మళ్లీ నిర్ణయం తీసుకోనున్నట్లుగా గూగుల్ వెల్లడించింది. అయితే గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం మొదటిసారి విధించిన నిషేధం మాత్రం కాదు. ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గూగుల్ రాజకీయ ప్రకటనలు నిలిపివేసింది.

అస్థిర రాజకీయ వాతావరణంతో గూగుల్ నిర్ణయం
డిసెంబరు 15 వరకు నిషేధాన్ని నిర్వహించింది. రాజకీయ సంఘటనలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో తాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకటనలను నిలుపుదల చేశామని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు
. ప్రస్తుత అస్థిర రాజకీయ వాతావరణంలో తప్పుడు సమాచారాన్ని నివారించడంతో పాటు, రాజకీయ హింసను ప్రోత్సహించే ప్రకటనలను నిరోధించడం గురించి కంపెనీకి విధానాలు ఉన్నాయని పేర్కొంది గూగుల్.

వార్తాసంస్తలతో సహా అందరికీ నిషేధం వర్తింపు
కంపెనీ విధానాలను అతిక్రమించి హింసాత్మక ధోరణిలో సాగే ప్రకటనలు చోటు చూసుకునే వాతావరణం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని గూగుల్ స్పష్టం చేసింది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఫేస్ బుక్ కూడా రాజకీయ ప్రకటనల మీద ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకొనే అవకాశం ఉందని ఎఫ్బీఐ ఇచ్చిన వార్నింగ్ తో టెక్ దిగ్గజం గూగుల్ సైతం అప్రమత్తమైంది. అందులో భాగంగానే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.