వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ గూగ్లీ: ఇడియట్ అని టైప్ చేస్తే ట్రంప్ ఫోటో కనిపిస్తోంది

|
Google Oneindia TeluguNews

ఎవరికైనా ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్ తల్లిని అడుగుతాము. అదే మొబైల్‌లోనో కంప్యూటర్‌లోనో ఆ విషయం గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తాము. గూగుల్‌ కూడా మనం వెతుకుతున్న అంశంపై తగిన సమాచారం ఇస్తుంది. అదే సమయంలో చాలామంది ఏ అంశమైతే వెతికారో ఆ అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇలా మేలో గూగుల్ చూపించిన ఫలితాల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఫేకూ అని చాలామంది సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. మళ్లీ గూగుల్ ఇదే రకమైన ఆసక్తి ఫలితాలను చూపిస్తోంది. ఈ సారి గూగుల్ ధాటికి బలైంది అగ్రరాజ్యపు అధినేత డొనాల్డ్ ట్రంప్.

ఇంతకీ విషయం ఏమిటంటే... ఇడియట్ అని ఇంగ్లీషులో గూగుల్ సెర్చ్‌లో టైప్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు వస్తున్నాయి. అయితే ఇదంతా ఓ కుట్రగా తెలుస్తోంది. ఆన్‌లైన్‌ యాక్టివిస్టులు గూగుల్ ఆల్గారిథమ్స్‌ను మ్యానుపులేట్ చేశారని సమాచారం. ఇడియట్ అనే పదాన్ని ట్రంప్ ఫోటోతో అనుసంధానించి గూగుల్ అల్గారిథమ్స్‌ను మార్చినట్లు సీనెట్ అనే సంస్థ తెలిపింది. ట్రంప్ ప్రవేశపెట్టిన విధానాలతో సంతృప్తిగా లేని వారే ఈ పనికి పాల్పడి ఉంటారని ఒక రిపోర్ట్ పేర్కొంది.

Google does it again: Type Idiot and you see Trump there

ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే గూగుల్ తప్ప మరొకటి లేదు. ప్రతి విషయంపై ఎంతోకొంత కరెక్ట్ సమాచారం గూగుల్ సెర్చ్ అందిస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ అల్గారిథమ్స్ ప్రముఖ పాత్ర పోషించి కంపెనీ వృద్ధి చెందడంలో దోహదపడ్డాయి. అదే సమయంలో ఇవే అల్గారిథమ్స్‌లో కొందరు మార్పులు చేయడం వల్ల అనర్థాలు కూడా జరిగాయి. మేలో గూగుల్ సెర్చ్‌లో పప్పు అని టైప్ చేసినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోటో కనిపించేది. మరోవైపు ఏప్రిల్‌లో భారత తొలి ప్రధాని ఎవరు అని గూగుల్‌లో సెర్చ్ చేయగా మోడీ ఫోటో ప్రత్యక్షమయ్యేది. ఇది గమనించిన గూగుల్ సంస్థ సెర్చ్ ఇంజిన్‌ను సరిచేసింది.

English summary
After grabbing headlines for showing results related to Indian Prime Minister Narendra Modi for the search of the word "Feku" in May, Google algorithms are again hogging the limelight. This time for showing images of US President Donald Trump for a search of the word "idiot".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X