వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ ఉద్యోగస్తులకు బంపరాఫర్: పిచాయ్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ నేపథ్యంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో ఆయాదేశాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక అన్నికంపెనీలు తమ ఉద్యోగస్తులను ఇళ్ల నుంచే పనిచేయాల్సిందిగా కోరాయి. ఈ క్రమంలోనే గూగుల్ కూడా తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగస్తులకు ల్యాప్ టాప్ ఖర్చులు, ఇతర ఫర్నీచర్ ఖర్చులకోసం 1000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.70వేలు ఇస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగస్తులకు లేఖ రాశారు.

ఇక ఇదే లేఖలో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న కంపెనీలు తిరిగి ఎలా ప్రారంభం అవుతాయో అనేదానిపై కూడా ఆయన వివరించారు. ఉద్యోగస్తులు రొటేషన్ పద్దతిలో హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. జూలై 6న ఆఫీసులకు రావాలని చెప్పిన సుందర్ పిచాయ్ 10శాతం మంది సిబ్బంది మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నాటికి సిబ్బందిని క్రమంగా 30శాతంకు పెంచాలని సూచించారు. ఇప్పుడు లేఖ ద్వారా తెలిపిన విషయాన్నే సుందర్ పిచాయ్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు.

Google employees to get 1000 dollars reimbursement, Sundar pichai writes letter to staff

కరోనావైరస్ నేపథ్యంలో గూగుల్ తన కార్యకలాపాలను క్రమంగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు పిచ్చాయ్. కోవిడ్-19తో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నష్టం వాటిల్లిందని చెప్పారు. మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ కూడా నష్టాల బాటపట్టిందని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఉద్యోగస్తులను ఇళ్ల నుంచే పనిచేయాల్సిందిగా అన్ని సంస్థలకంటే ముందుగా చెప్పింది గూగుల్ కావడం విశేషం. ఈ కరోనా కష్టకాలంలో కూడా తన అంచనాలను చేరుకుందని పిచాయ్ చెప్పారు.

Recommended Video

#IndiansAgainstTikTok : TikTok Rating Drops In Google Play Store

ఇక ఆఫీసులో వాతావరణం అంతా వేరుగా ఉంటుందని పిచాయ్ హామీ ఇచ్చారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సామాజిక దూరం, శానిటైజేషన్ ఆయా దేశ ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను పాటించడం జరుగుతుందని వెల్లడించారు. ఆఫీసును ఖాళీ చేయక ముందు తిరిగి వచ్చాక తేడాను కచ్చితంగా గమనిస్తారు అని వెల్లడించింది. ఇక జూన్ 10 నాటికల్లా ఉద్యోగస్తులు ఆఫీసులకు రావాలా లేదా అన్నది మేనేజర్లు తమ ఉద్యోగస్తులకు చెబుతారని పిచాయ్ చెప్పారు. ఆఫీసులో పనిచేసేందుకే ఆసక్తి చూపుతున్న ఉద్యోగస్తులు తమ మేనేజర్‌లతో మాట్లాడాలని వెల్లడించారు.

English summary
Google will reimburse employees up to $1,000 to pay for equipment to help them work from home, CEO Sundar Pichai wrote to employees on Tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X