వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైండ్ బ్లాక్ : గూగుల్‌ తమ ఉద్యోగస్తులకు చెల్లించే జీతాలు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఈ రోజుల్లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం దొరకడమే కష్టంగా మారుతోంది. అయితే కొన్ని అదృష్టం బాగుండి మంచి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం దక్కితే లైఫ్ సెటిల్ అయినట్లే. ఎందుకంటే ఆ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు మరి ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇంతకీ ఆ కంపెనీలు ఏంటి..? ఎంత జీతాలను ఇస్తున్నాయి...?

తొలి మూడు స్థానాల్లో గూగుల్, ఫేస్‌బుక్ మైక్రోసాఫ్ట్

తొలి మూడు స్థానాల్లో గూగుల్, ఫేస్‌బుక్ మైక్రోసాఫ్ట్

మనిషి బతికేందుకు సంపాదన తప్పనిసరి. అందుకోసం ఒకవేళ బాగా చదువుకుని ఉంటే తన స్థాయికి తగ్గ ఉద్యోగం కోసం వేట మొదలుపెడుతాడు. ప్రభుత్వ ఉద్యోగాలను అటుంచితే కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు లక్షలు, కోట్లలోనే జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి కంపెనీలో ఉద్యోగం పొందాలంటే అకడమిక్ కెరీర్‌తో పాటు కాస్త లక్‌కూడా కలసిరావాల్సిందే.

తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధిక జీతాలు ఇస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో గూగుల్ తొలిస్థానంలో నిలువగా ఫేస్‌బుక్ రెండో స్థానం, మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలో నిలిచాయి. ఉద్యోగులకు జీతాలు, జాబ్ శాటిస్‌ఫాక్షన్, ఇతర బెనిఫిట్లపై దాదాపు 50వేల మంది ఉద్యోగులను ప్రశ్నించింది కెరీర్ సైట్ అనలైజర్ అనే సంస్థ. ఇందులో గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలు అని చాలామంది చెప్పారట.

 అతి తక్కువ జీతంగా ఏడాదికి రూ.1.74 కోట్లు చెల్లిస్తున్న గూగుల్

అతి తక్కువ జీతంగా ఏడాదికి రూ.1.74 కోట్లు చెల్లిస్తున్న గూగుల్

ఈ మూడు ఎంఎన్‌సీల్లో అతితక్కువ జీతం తీసుకుంటే ఏడాదికి రూ.94,71,455గా ఉంది. ఏడాదికి ఇంత జీతమా అని మీరు ఆశ్చర్యపోయిండొచ్చు. కానీ ఇది నిజం. ఈ జీతం మామూలు స్థాయిలో ఉండే కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. అదే గూగుల్ లాంటి సంస్థలో అయితే జీతాలు ఎలా ఉంటాయో ఊహించొచ్చు.

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మధ్యతరహా జీతాల్లో 25శాతం పెరుగుదల నమోదు చేసినట్లు సంస్థ వెల్లడించింది. అంటే 1.74 కోట్లు ఏడాదికి అక్కడి ఉద్యోగులు జీతం తీస్తున్నారట. ఇక గూగుల్ సంస్థలో డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌ పొజిషన్‌లో ఉన్న ఉద్యోగికి ఏడాదికి జీతం రూ.4.24 కోట్లు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది.

 రూ.1.62 కోట్లు జీతాలు చెల్లిస్తున్న ఫేస్‌బుక్

రూ.1.62 కోట్లు జీతాలు చెల్లిస్తున్న ఫేస్‌బుక్

సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్ గతేడాదిగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది. కొత్తవారిని తీసుకోవడంతో ఈ ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో మధ్యతరహా జీతాలు గతేడాది 1.76 కోట్లుగా ఉండగా ఈ సారి అది రూ.1.62 కోట్లకు చేరుకుంది. ఇక ట్విటర్‌, స్క్వేర్, వర్క్‌డే, నివిడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు తక్కువగా ఏడాదికి రూ.1.06 కోట్లు జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం.

English summary
Google is the top company to work with followed by Facebook and Microsoft at second and third spots respectively.The findings reveal that the median estimated salary, including base and bonus, is more than Rs 94,71,455 ($134,000) a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X