• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హాలీవుడ్‌ ఐకాన్‌ షిర్లే టెంపుల్‌కు గూగుల్‌ అరుదైన గౌరవం- యానిమేటెడ్‌ డూడుల్‌తో

|

2015 లో ఇదే రోజున, శాంటా మోనికా హిస్టరీ మ్యూజియం "లవ్, షిర్లీ టెంపుల్"ను ప్రారంభించింది, ఆమె అరుదైన జ్ఞాపకాల సేకరణను కలిగి ఉన్న ప్రత్యేక ప్రదర్శనశాల ఇది. "హాలీవుడ్ యొక్క టాప్ బాక్స్ ఆఫీస్ డ్రాగా గ్రేట్ డిప్రెషన్ యొక్క కష్టాలతో బాదపడుతున్న మిలియన్ల మంది అమెరికన్లకు టెంపుల్‌ సహాయం చేయడమే కాక, అంతర్జాతీయ సంబంధాలలో ఆమె చేసిన కృషి ద్వారా ఆమె తన చరిష్మాను ప్రపంచంతో పంచుకుంది" అని గూగుల్ తెలిపింది.

షిర్లే టెంపుల్‌ ఏప్రిల్ 23, 1928 న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జన్మించింది. ఆమె మూడేళ్ల వయసులో డ్యాన్స్ క్లాసులు ప్రారంభించింది. మ్యూజికల్ స్టాండ్ అప్ అండ్ చీర్ లో పోషించిన పాత్రకు యావత్‌ దేశాన్ని ఆకర్షించింది. "లిటిల్ మిస్ మిరాకిల్" 1934 లో డజను చిత్రాలలో నటించింది. ఆమె అమెరికన్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటీనటుల్లో ఒకరు. ఆరేళ్ల వయసులో అకాడమీ అవార్డు అందుకున్న మొదటి బాల నటి కూడా.

Google honours Hollywood icon Shirley Temple with animated doodle

22 సంవత్సరాల వయస్సులో టెంపుల్‌ సినీ పరిశ్రమ నుండి హాలీవుడ్ చిహ్నంగా రిటైర్మెంట్‌ తీసుకుంది. కానీ తరువాత "టెలివిజన్ సిరీస్" షిర్లీ టెంపుల్ స్టోరీబుక్ "ను ప్రారంబించింది. ఇది కుటుంబ-స్నేహపూర్వక కథలను అందించింది. 1969 లో టెంపుల్‌ను ఐక్యరాజ్యసమితి (యుఎన్) కు యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధిగా నియమించారు. మానవ పర్యావరణంపై 1972 UN సమావేశంలో ఆమె అమెరికాకు ప్రాతినిధ్యం వహించింది. అనంతరం, ఈ రిపబ్లికన్ నేతకు ఘనా, చెకోస్లోవేకియాకు అమెరికా రాయబారి బాధ్యతలు దక్కాయి. స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు ప్రోటోకాల్ యొక్క మొదటి మహిళా చీఫ్ కూడా అయ్యారు. 2006 లో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ టెంపుల్‌ను లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుతో గౌరవించింది. ఇది సంస్థ యొక్క అత్యున్నత గౌరవం. చివరికి టెంపుల్‌ 2014 లో కన్నుమూసింది. ఆమెకు ముగ్గురు పిల్లలు.

English summary
Search engine giant Google, on June 9, honoured American actor, dancer, singer, and diplomat Shirley Temple with an animated doodle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X