• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2021లోనైనా హుషారు కోరుతూ.. పార్టీ మూడ్‌లో New Year's Eve 2020 గూగుల్ డూడుల్ చూశారా?

|

ఒక్క చైనీయులకు తప్ప.. భూమ్మీద జీవించి ఉన్న మిగతా వాళ్లందరికీ 2020 ఏడాది మహా విషాదాన్ని నింపింది. మన ఇంట్లోనో, బందువులో, తెలిసినవాళ్లో, పరిచయస్తుతో ఎంతో మంది వైరస్ కాటుకు బలైపోవడం, లాక్ డౌన్ దెబ్బకు వ్యక్తిగతంగా మనమూ నష్టపోవడం, స్కూళ్లు ఇంకా మూసే ఉంచడంతో పిల్లల చదువులపై సందేహాలు.. ఇక వ్యాక్సిన్ వచ్చేసిందని సంతోషించేలోపే కొత్త రకం వైరస్ వ్యాప్తి.. అసలు తలుచుకుంటేనే కంపరం పుట్టించే ఈ ఏడాది ఎట్టకేలకు ముగిసిపోనుంది..

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

కనీసం మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేయడానికి కూడా ఒకింత సందేహించాల్సిన పరిస్థితిలో.. రేపటిపై ఆశ కోల్పోవద్దనే కొత్త ఏడు మనను పలకరించబోతున్నది. విషాదాన్ని హుషారులో తొక్కిపారేసేందుకు ఇప్పటికే జనం సెలబ్రేషన్ మూడు లోకి వెళ్లిపోయారు. డిసెంబర్ 31 పార్టీలకు సిద్ధమైపోయారు. అఫ్‌కోర్స్, ఈసారి వేడుకలు కచ్చితంగా గతమంత ఘనంగా ఉండవు. అయితే 2020 కంటే 2021 బాగుండాలనే ఆకాక్ష ఉండాల్సిందే. ఇలా సందర్భాలు ఏవైనా మనందరినీ ఆలరించే గూగుల్ డూడుల్ న్యూఇయర్ ఈవ్ కోసం ఇంకాస్త సుందరంగా సింగారించుకుంది..

 Google is celebrating New Years eve 2020 with an animated Doodle and confetti poppers

అన్నిప్రముఖమైన సందర్భాలలో తన డూడుల్ ద్వారా సందేశాన్ని తెలిపే గూగుల్ సంస్థ.. డిసెంబర్ 31న న్యూ ఇయర్ ఇవినింగ్ వేడుకల కోసం మనల్ని పార్టీ మూడ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గూగుల్ ఇప్పటికే తన అందమైన డూడుల్‌తో వేడుకను ప్రారంభించింది. తన డూడుల్‌లో 'గూగుల్' అనే పదాన్ని రంగురంగుల లైట్లతో అలంకరించి మధ్యలో పాత తరహా బర్డ్‌హౌస్ అనలాగ్ 2020 గడియారాన్ని అమర్చింది...

యెమన్: అడెన్ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు -ఇప్పటికే 26 మంది మృతి -తృటిలో మంత్రులు ఎస్కేప్యెమన్: అడెన్ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు -ఇప్పటికే 26 మంది మృతి -తృటిలో మంత్రులు ఎస్కేప్

ఆ గడియారం గడియారం టిక్ టిక్ మంటూ 2021 కౌంట్డౌన్ మొదలైనట్లు సూచిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ స్క్రీన్ మీదుగా పూల వర్షం కురిసి న్యూ ఇయర్ ఈవినింగ్ పేజీని చూపిస్తుంది. ఈ డూడుల్ అర్ధరాత్రి 12 గంటలు అయిన తర్వాత అందులోని గడియారం విచ్చుకొని దానిలోంచి ఓ పక్షి వచ్చి న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతుంది. అద్భుతంగా ఉంది కదా.. మీరు ఆస్వాదించండి. అలాగే 'వన్ ఇండియా తెలుగు' తరఫున శుభాకాంక్షలు కూడా అందుకోండి..

New Year's Eve 2020

English summary
It's the last day of 2020 - the year that will be remembered as a mixed bag of sour and bitter experiences. While everyone is prepping up for the New Year's eve with their friends and family, Google is celebrating it with a cute animated Doodle. Google often modifies the Doodle to mark an important day, celebrate an occasion or some great personality. Today, the tech giant is bidding goodbye to 2020 in a special way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X